Indian antiquities: అమెరికా దొంగిలించిన భారతీయ పురాతన వస్తువులు తిరిగొస్తున్నాయ్.. వాటిలో ప్ర‌ధాన‌మైనవి ఇవే..

అమెరికా నుంచి భారత్ కు రానున్న పురాతన వస్తువులు దాదాపు 400 ఏళ్ల మధ్య కాలానికి చెందినవి. భారత్ లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన

Joe Biden and Modi

297 Indian Antiquities : ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటన సమయంలో భారతదేశం నుంచి గతంలో అమెరికాకు అక్రమంగా రవాణా చేసిన 297 పురాతన వస్తువులను అమెరికా భారతదేశంకు తిరిగి ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా మోదీ తెలిపారు. 297 అమూల్యమైన పురాతన వస్తువులను భారతదేశానికి తిరిగి ఇచ్చేలా హామీ ఇచ్చినందుకు అధ్యక్షుడు జో బిడెన్, యూఎస్ ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మోదీ పేర్కొన్నారు.

Also Read : PM Modi : భారత్ చెబితే ప్రపంచం వింటుంది.. న్యూయార్క్‌లో ప్రధాని మోదీ ప్రసంగంలో ఐదు ప్రధాన అంశాలు ఇవే..

ఈ పురాతన వస్తువులు దాదాపు 400 ఏళ్ల మధ్య కాలానికి చెందినవి. భారత్ లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన క్రీస్తు పూర్వం 2000 నుంచి క్రీస్తు శకం 1900 మధ్య కాలానికి చెందిన వస్తువులు ఇవి. ఈ పురాతన వస్తువుల్లో చాలా వరకు తూర్పు భారత్ కు చెందిన టెర్రాకోట కళాఖండాలు.. మిగతావి రాయి, లోహాలు, కలప, దంతాలతో సృష్టించిన దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాఖండాలు ఉన్నాయి.

 

  • భారత్ కు అందిస్తున్న పురాతన వస్తువుల్లో ప్రధానమైనవి కొన్ని..
    మధ్య భారతానికి చెందిన క్రీస్తుశకం 10-11వ శతాబ్దాల నాటి ఇసుకరాతి అప్సర.
    మధ్య భారతానికి చెందిన క్రీస్తు శకం 15-16వ శాతాబ్దాల నాటి కాంస్య జైన తీర్థంకర విగ్రహం.
    తూర్పు భారతానికి చెందిన క్రీస్తు శకం 3-4 శతాబ్దాల నాటి టెర్రాకోట పాత్ర.
    దక్షిణ బారతదేశానికి చెందిన క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం, క్రీస్తుశకం 1వ శతాబ్దం నాటి రాతి శిల్పం.
    క్రీస్తు శకం 17-18 శతాబ్దాల నాటి దక్షిణ భారతదేశానికి చెందిన వినాయకుడి విగ్రహం.
    క్రీస్తు శకం 15-16 శతాబ్దాల నాటి ఉత్తర భారతదేశానికి చెందిన ఇసుకరాయితో చేసిన నిలబడి ఉన్న బుద్ధుడి విగ్రహం.
    క్రీస్తు శ‌కం 17-18 శతాబ్దాల నాటి తూర్పు భార‌త‌దేశానికి చెందిన కాంస్యంతో చేసిన విష్ణు భ‌గ‌వానుడి విగ్ర‌హం.
    క్రీస్తు పూర్వం 2000-1800 కాలం నాటి ఉత్త‌ర భార‌తానికి చెందిన రాగితో చేసిన‌ స‌గుణ‌వాది విగ్ర‌హం.
    క్రీస్తు శ‌కం 17-18 శ‌తాబ్దాల నాటి ద‌క్షిణ భార‌తానికి చెందిన కాంస్యంతో చేసిన కృష్ణ భ‌గ‌వానుడి విగ్ర‌హం.
    క్రీస్తు శ‌కం 13-14 శ‌తాబ్దాల నాటి దక్షిణ భార‌తానికి చెందిన నల్ల‌రాతి కార్తికేయ భ‌గ‌వానుడి విగ్ర‌హం.