PM Modi : భారత్ చెబితే ప్రపంచం వింటుంది.. న్యూయార్క్‌లో ప్రధాని మోదీ ప్రసంగంలో ఐదు ప్రధాన అంశాలు ఇవే..

ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ రోజు ప్రపంచం మొత్తంతో భారత భాగస్వామ్యం పెరుగుతోంది. అంతకుముందు భారతదేశం సమాన దూరం అనే విధానాన్ని అనుసరించేది.

PM Modi : భారత్ చెబితే ప్రపంచం వింటుంది.. న్యూయార్క్‌లో ప్రధాని మోదీ ప్రసంగంలో ఐదు ప్రధాన అంశాలు ఇవే..

PM Modi

Updated On : September 23, 2024 / 7:13 AM IST

PM Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం న్యూయార్క్ లోని నస్సావ్ వెటరన్స్ కొలస్సియంలో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సుకు దాదాపు 13వేల మంది హాజరయ్యారు. భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 382 మంది జాతీయ, అంతర్జాతీయ కళాకారులు ప్రదర్శనలిచ్చారు. అనంతరం ప్రవాస భారతీయులను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. ఒకవైపు భారత్ చేస్తున్న శాంతి ప్రయత్నాలను ప్రస్తావిస్తూనే మరోవైపు వివిధ రంగాల్లో భారత్ సాధించిన విజయాలను కూడా ఆయన వివరించారు. ఇది యుద్ధ యుగం కాదని భారత్ చెప్పినప్పుడు ప్రపంచం సీరియస్ గా వింటుందని అన్నారు. అమెరికా కంటే భారత్ 5జీ మార్కెట్ పెద్దదని మోదీ అన్నారు. ప్రధాని మోదీ ప్రసంగంలోని ఐదు ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం.

Also Read : భారత ప్రధాని మోదీ పక్కనే నిలబడి ఆయన పేరును మర్చిపోయిన బైడెన్.. వీడియో వైరల్

♦ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ రోజు ప్రపంచం మొత్తంతో భారత భాగస్వామ్యం పెరుగుతోంది. అంతకుముందు భారతదేశం సమాన దూరం అనే విధానాన్ని అనుసరించేది. నేడు భారతదేశం సన్నిహిత విధానాన్ని అనుసరిస్తోందని మోదీ చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ వేదికపై భారతదేశం ఏదైనా చెప్పినా ప్రపంచం వింటుందని మోదీ పేర్కొన్నారు.

♦ ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ బ్రాండ్లు భారతదేశంలోనే తయారు చేయబడ్డాయి. నేడు భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ తయారీదారు. ఒకప్పుడు మనం మొబైల్ దిగుమతిదారులుగా ఉన్నాం.. నేడు మొబైల్ ఎగుమతిదారులుగా మారామని మోదీ చెప్పారు. భారత్ ప్రపంచానికి డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ యొక్క కొత్త భావనను అందించింది. నేడు అమెరికా కంటే భారత్ 5జీ మార్కెట్ పెద్దది. ఇది రెండేళ్లలో జరిగింది. ఇప్పుడు భారతదేశం మేడ్ ఇన్ ఇండియా 6జీపై పనిచేస్తోందని మోదీ చెప్పారు. అమెరికాలో కూడా మేడ్ ఇన్ ఇండియా చిప్స్ చూసే రోజు ఎంతోదూరంలో లేదు.. ఈ చిన్న చిప్ అభివృద్ధి చెందిన భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని మోదీ హామీ ఇచ్చారు.

♦ ప్రపంచ జనాభాలో 17శాతం ఉన్నప్పటికీ ప్రపంచ కర్బన ఉద్గారాల్లో భారత్ వాటా 4శాతం మాత్రమేనని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచాన్ని నాశనం చేయడంలో మన పాత్ర లేదు. మిగిలిన ప్రపంచంతో పోలిస్తే కార్బన్ ఇంధనాన్ని మండించడం ద్వారా మాత్రమే మన వృద్ధికి మద్దతు ఇవ్వగలం. కానీ, భారత్ హరిత పరివర్తన మార్గాన్ని ఎంచుకుంది. ప్రకృతిపట్ల మన ప్రేమ విలువలు మనకు మార్గనిర్దేశం చేశాయి కాబట్టి భారత్ దేశం సౌర, పవన , హైడ్రో, గ్రీన్ హైడ్రోజన్, అణుశక్తిపై పెట్టుబడి పెడుతున్నాయని మోదీ చెప్పుకొచ్చారు. పారిస్ వాతావరణ లక్ష్యాలను పూర్తి చేసిన తొలి జీ-20 దేశంగా భారత్ నిలిచింది. 2014 నుంచి భారతదేశం తన సౌరశక్తి స్థాపన సామర్థ్యాన్ని 30రెట్లు ఎక్కువ పెంచుకుందని మోదీ చెప్పారు.

♦ బోస్టన్, లాస్ ఏంజెల్స్ లో కొత్త కాన్సులేట్ లను ఏర్పాటు చేయనున్నట్లు మోదీ ప్రకటించారు. మా ప్రభుత్వం సీటెల్ లో కొత్త కాన్సులేట్ ను ప్రారంభిస్తుందని గత సంవత్సరం నేను ప్రకటించాను.. ఇది ఇప్పుడు ప్రారంభమైందని మోదీ చెప్పారు. మరో రెండు కాన్సులేట్ లను బోస్టన్, లాస్ ఏంజిల్స్ లలో ప్రారంభించాలని భారతదేశం నిర్ణయించిందని మోదీ చెప్పారు. ప్రవాస భారతీయులంతా ఎల్లప్పుడూ భారతదేశపు బలమైన బ్రాండ్ అంబాసిడర్లు. అందుకే మీ అందరినీ జాతీయ రాయబారులుగా పిలుస్తున్నానని మోదీ చెప్పారు.

♦ విద్య, .నైపుణ్యం, పరిశోధన, ఆవిష్కరణల ప్రాతిపదికన 21వ శతాబ్దపు భారతదేశం ముందుకు సాగుతోందని మోదీ చెప్పారు. నలంద విశ్వవిద్యాలయం పేరు మీ అందరికీ సుపరిచితమే. ఇటీవల, భారతదేశంలోని పురాతన నలంద విశ్వవిద్యాలయం కొత్త అవతారంలో ఉద్భవించింది. నేడు అది యూనివర్శిటీనే కాదు.. నలంద స్ఫూర్తిని పునరుజ్జీవింపజేస్తోందని మోదీ అన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు భారత్ కు వచ్చి చదువుకోవాలని, అలాంటి ఆధునిక వ్యవస్థను రూపొందిస్తున్నామని మోదీ చెప్పారు.