భారత ప్రధాని మోదీ పక్కనే నిలబడి ఆయన పేరును మర్చిపోయిన బైడెన్.. వీడియో వైరల్

''ఇప్పుడు నేను ఎవరిని పరిచయం చేస్తున్నాను?'' అని అడిగారు. దీంతో వెంటనే మోడరేటర్ స్పందిస్తూ.. భారత ప్రధాని మోదీని..

భారత ప్రధాని మోదీ పక్కనే నిలబడి ఆయన పేరును మర్చిపోయిన బైడెన్.. వీడియో వైరల్

Updated On : September 22, 2024 / 6:38 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన వేళ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. క్వాడ్ లీడర్స్ సమ్మిట్ సందర్భంగా డెలావేర్‌లోని క్లేమోంట్‌లోని ఆర్చ్‌మెర్ అకాడమీలో జరిగిన మీడియా సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

ఆ సమయంలో బైడెన్ పక్కనే మోదీ ఉన్నారు. ప్రధాని మోదీని పరిచయం చేసే సమయంలో ఆయన పేరును బైడెన్ మర్చిపోయారు. మోదీ పేరు గుర్తురాక, ఏమీ మాట్లాడలేక తడబడుతూ తన చుట్టూ చూశారు.

”ఇప్పుడు నేను ఎవరిని పరిచయం చేస్తున్నాను?” అని అడిగారు. దీంతో వెంటనే మోడరేటర్ స్పందిస్తూ.. భారత ప్రధాని మోదీ పేరు చెప్పారు. ఆ తర్వాత సమావేశంలో మోదీ మాట్లాడారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా కూడా పాల్గొన్నారు.

బైడెన్ గతంలోనూ పలువురి పేర్లు మర్చిపోయి తికమకపడ్డారు. తాజాగా, మోదీ పేరును మర్చిపోగా తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై ఓ ఇన్‌ప్లూయన్సర్ ఎక్స్‌లో స్పందిస్తూ.. ”మనకు అసలు అధ్యక్షుడు అనేవారే లేరు. మీడియా సమావేశంలో భారత ప్రధానమంత్రితో ఉన్నానన్న విషయాన్నే బైడెన్ పూర్తిగా మర్చిపోయారు. ప్రపంచం మొత్తం మనల్ని చూసి నవ్వుకుంటోంది” అని పేర్కొన్నారు.

ఇరాన్‌లో భారీ పేలుడు.. ప్రాణాలు కోల్పోయిన 51 మంది