US Tariffs
US Tariffs : భారత్ మీద అమెరికా టారిఫ్ లు అమల్లోకి వచ్చాయి. 50 శాతం టారిఫ్ లు ఆగస్ట్ 27 నుంచి అమల్లోకి వచ్చాయి. మరో 25 శాతం టారిఫ్ లు కూడా అదనంగా విధించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అమెరికా దెబ్బకు భారత్ లో చాలా రంగాల మీద ప్రభావం పడనుంది. టెక్స్ టైల్స్, జెమ్స్ – జ్యూయలరీ, లెదర్, ఆహారం, ఆటోమొబైల్ రంగాల మీద తీవ్ర ప్రభావం చూపనుంది. ఏపీ నుంచి ఎగుమతి అయ్యే రొయ్యల మీద కూడా ఇంపాక్డ్ పడనుంది. ఓ వైపు టారిఫ్ లతో ఇబ్బందులు ఉన్నా కూడా మరోవైపు అమెరికాతో ఇండియా మరో డీల్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
తేజస్ ఫైటర్ జెట్స్ కు సంబంధించిన ఇంజిన్లను కొనుగోలు చేసేందుకు అమెరికాతో భారత్ 1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.8778 కోట్లు) ఒప్పందం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 97 LCA Mark 1A తేజస్ ఫైటర్ జెట్స్ 113 ఇంజిన్లను కొనేందుకు భారత్ అమెరికాతో డీల్ మాట్లాడుతున్నట్టు సమాచారం. ఈ డీల్ కు సంబంధించి రెండు దేశాలు సెప్టెంబర్ లో అగ్రిమెంట్ చేసుకునే అవకాశం ఉందని డిఫెన్స్ సోర్సెస్ చెప్పినట్టు ఇండియా టుడే కథనంలో పేర్కొంది.
భారత్ లో హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. వాటికి సంబంధించి ఇంజిన్ల కొరత రాకుండా ఉండేందుకు ఇండియా.. అమెరికాతో ఈడీల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హెచ్ఏఎల్ మొదటి బ్యాచ్ యుద్ధ విమానాలను (83) 2029-30 నాటికి డెలివరీ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. మరో 97 యుద్ధ విమానాలను 2033-34 నాటికి డెలివరీ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఇంజిన్ల లభ్యత ఉండాలి. అందుకే అమెరికాతో డీల్ కు ఇండియా సిద్ధమైంది. అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) ఈ ఇంజిన్లను డెలివరీ చేయడానికి రెడీగా ఉన్నట్టు సమాచారం.
ఈ డీల్ తో పాటు జీఈ కంపెనీలో హాల్ సెపరేట్ గా మరో డీల్ కూడా చేయనున్నట్టు తెలుస్తోంది. జీఈ-414 ఇంజిన్లను కొనాలనుకుంటోంది. సుమారు 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఈ డీల్ తో 200 ఇండియా LCA Mark 2, అడ్వాన్స్ డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ లను రెడీ చేయనుంది. ఈ అగ్రిమెంట్ లో జీఈ కంపెనీ 80 శాతం టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ కూడా చేయాలని భారత్ కండిషన్ పెట్టనుంది. మిగ్ 21 విమానాలను మెల్లగా తగ్గించి ఎయిర్ ఫోర్స్ కు కొత్త ఆయుధాలను సమకూర్చే క్రమంలో ఈ డీల్ చేస్తున్నట్టు సమాచారం.