Kedarnath Temple : సీసీటీవీ నిఘాలో కేదారేశ్వరుడు .. ఆలయంలో ఫోటోలు, వీడియోలు నిషేధం

ఉత్తరాఖండ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్ ఆలయ కమిటీ ఇక నుంచి కేదార్ నాథ్ ఆలయంలో ఫోటోలు,వీడియోలు తీసుకోవటంపై నిషేధం విధించింది. ఇక నుంచి భక్తులు స్వామి దర్శనానికి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని ప్రకటించింది.

mobile phones Ban Kedarnath temple

Kedarnath temple : ఉత్తరాఖండ్‌లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్ ఆలయ కమిటీ కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి కేదార్ నాథ్ ఆలయంలో ఫోటోలు,వీడియోలు తీసుకోవటంపై కమిటీ నిషేధం విధించింది. దీంతో ఇక నుంచి భక్తులు స్వామి దర్శనానికి మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని ప్రకటించింది. ఆలయంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది.

ఇటీవల కేదార్‌నాథ్ ఆల‌యం ఎదుట ఓ యువతి త‌న బాయ్‌ఫ్రెండ్ కు ప్రపోజ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో పసుపు రంగుల దుస్తులు ధరించిన జంట దేవాలయం ఎదురుగానే కౌగలించుకుని ముద్దులు పెట్టుకున్న ఘటన వైరల్ గా మారింది. ఈ ఘటనతో ఆలయ కమిటీ పవిత్రమైన పుణ్యక్షేత్రం వద్ద ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండించింది. అనంతరం భక్తులు మొబైల్స్ తీసుకురావద్దని..ఆలయం లోపల ఫొటోలు, వీడియోలు తీసుకోవడం పూర్తిగా నిషేధం విధిస్తు ప్రకటన జారీ చేసింది. ఆలయంలో సీసీటీవీ కెమెరాల నిఘా పర్యవేక్షణ ఉంటుందని..నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం మని ఆలయ కమిటీ ప్రకటించింది.

Adhik Sravana Masam 2023 : ఈరోజు నుంచే అధిక శ్రావణమాసం ప్రారంభం .. ఈ నెలంతా ఈ పనులు అస్సలు చెయొద్దు..

పసుపు రంగు చీర కట్టుకున్న ఓ మహిళ తన బాయ్ ఫ్రెండ్ కు దేవాలయం ఎదుటే ప్రపోజ్ చేసింది. పంచె కట్టుకుని పసుపు రంగు కుర్తా వేసుకున్న సరదు వ్యక్తి ఇద్దరు కలిసి కళ్లు మూసుకుని దణ్ణం పెట్టుకున్నారు. ఈక్రమంలో సదరు మహిళ తన చేతులు వెనక్కి పెట్టి వెనుక ఉన్న ఓ వ్యక్తికి సైగ చేసింది.సదరు వ్యక్తి ఓ బాక్సు ఇవ్వకుడా బాయ్ ఫ్రెండ్ కళ్లు తెరిచే సమయంలో ఆమె మోకాళ్లపై కూర్చుని రింగ్ చూపిస్తు ప్రపోజ్ చేసింది. సదరు వ్యక్తి కళ్లు తెరిచి చూసి సర్ ప్రైజ్ అయ్యాడు. అంతే వారిద్దరు అక్కడే ఎంతో మంది భక్తులు ముందే..దేవాలయం ఎదుకటే కౌగలించుకుని ముద్దులు పెట్టుకున్నారు. ఇటువంటి ఘటనలు చారితాత్మక పుణ్యక్షేత్రం వద్ద చేయటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Varalakshmi Puja 2023 : ఈ ఏడాది అధిక శ్రావణ మాసాలు, వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలో తెలుసా..?

ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని మంచు కొండల్లో శివ శివా అంటూ కేదారేశ్వరుడిని దర్శించుకుంటారు. అటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి పనులు తగదని మండిపడుతున్నారు. గతంలో కూడా ఆలయ పరిసరాల్లో కొంతమంది భక్తులు ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ అనుచితంగా ప్రవర్తించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ వెల్లడించింది.