Varalakshmi Puja 2023 : ఈ ఏడాది అధిక శ్రావణ మాసాలు, వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలో తెలుసా..?

19 ఏళ్ల తరువాత 2023లో అధిక శ్రావణ మాసం వచ్చింది. మరి శ్రావణమాసంలో చేసుకునే వరలక్ష్మీ పూజ ఎప్పుడు జరుపుకోవాలి..? పండితులు ఏం చెబుతున్నారు. అధిక ఆషాడంలో ఏఏమేమి చేయకూడదు?

Varalakshmi Puja 2023 : ఈ ఏడాది అధిక శ్రావణ మాసాలు, వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలో తెలుసా..?

Adhika Sravan Masam ..Varalakshmi Puja2023

Adhika Shravana Masam – Varalakshmi Puja 2023: శ్రావణ మాసం అంటే వరలక్ష్మీ పూజ గుర్తుకొస్తుంది. శుక్రవారం వరాలు ఇచ్చే లక్ష్మీ పూజలకు మహిళలు సిద్ధమవుతుంటారు. ముత్తైదువలు.. వాయినాలు ఇలా ప్రతీ ఇల్లు వరలక్ష్మీ దేవి పూజతో శోభాయమానంగా కనిపిస్తుంది. వరలక్ష్మీ పూజలు చేసిన ముత్తైదువలు చేతికి పువ్వులు, ఆకులతో చేసిన తోరాలు కట్టుకుని చేతినిండా గాజులతో అపర లక్ష్మీదేవిల్లా కనిపిస్తారు. పూజలు, వ్రతాలతో ఇళ్లు ఆధ్మాత్మికతతో కళకళలాడిపోతుంటాయి.

మరి ఈ ఏడాది (2023)లో అధిక శ్రావణమాసాలు వచ్చాయి. 19 ఏళ్ల తరువాత ఇలా అధిక శ్రావణ మాసం వచ్చింది. మరి వరలక్ష్మీ పూజ ఎప్పుడు చేసుకోవాలి? అధిక శ్రావణంలో చేసుకోవాలా..? లేక నిజ శ్రావణమాసంలో చేసుకోవాలా..? అని మహిళలు తికమకపడుతుంటారు. మరి ఎప్పుడు వరలక్ష్మీ పూజ చేసుకోవాలి?.పండితులు ఏం చెప్పారు..? అనే విషయాలు తెలుసుకుందాం..

హిందూ సనానత ధర్మం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో విశిష్ఠత ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. తెలుగు సంవత్సరంలో ఐదో నెల శ్రావణ మాసం. ప్రతీ ఏటా కాస్త రోజుల తేడాల్లో జులై, ఆగస్టు నెలల్లోనే వస్తుంది. తెలుగు పంచాంగం ప్రకారం జులై 18వ తేదీ నుంచి శ్రావణ మాసం మొదలు కానుంది. ఇది అధిక శ్రావణం…ఇది ఆగస్టు 16 వరకు ఉంటుంది. ఈ సంవత్సరం అధికమాసం కావడం వల్ల మొదట వచ్చేదానినే అధిక శ్రావణమాసం అంటారు. నిజ శ్రావణమాసం ఆగస్టు 17 నుంచి మొదలై సెప్టెంబరు 15 వరకూ ఉంటుంది. అంటే నిజ శ్రావణ మాసంలోనే వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి. అలా ఈ ఏడాది వరలక్ష్మీ వ్రతం శుక్రవారం అంటే ఆగస్టు 25న జరుపుకోవాలి. దక్షిణాయణంలో వచ్చే అత్యంత విశిష్టమైన నెల శ్రావణం.ఈ నెలలో లక్ష్మీఆరాధన, గౌరీ ఆరాధనతో పాటూ శివారాధన అత్యంత పుణ్యఫలం అని పండితులు చెబుతున్నారు.

Shravana Masam 2023 : 19 ఏళ్ల తర్వాత వచ్చిన అధిక శ్రావణ మాసం .. ఈ పనులు అస్సలు చేయొద్దు

అధికమాసంలో పూజలు.. శుభకార్యాలు చేయొద్దు..
నిజమాసంలో జరిగే పూజలు, నోములేవీ అధికమాసంలో చేయరు. అందుకే మంగళగౌరి వ్రతం చేసుకునేవారు శ్రావణశుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసేవారు నిజ శ్రావణంలోనే చేయాలని చెబుతున్నారు పండితులు.

ఇంకా చెప్పాలంటే పండుగలు అన్నీ నిజ శ్రావణమాసంలోనే వస్తాయి. శ్రావణమాసంలో మంగళగౌరీ వ్రతం చేసేవారికోసం 2023లో నాలుగు మంగళవారాలు(ఆగస్టు 22, 29 సెప్టెంబరు 4, 11) మాత్రమే వచ్చాయి. శ్రావణ శుక్రవారం ఆగస్టు 25న వచ్చింది. అంటే నిజ శ్రావణ మాసంలో వచ్చింది..

శ్రావణం శివుడికి ప్రీతికరం..
శ్రావణమాసం అంటే అమ్మవారికి పూజలు,నోములు, వ్రతాలే కాదు..పరమశివుడికి అంత్యత ప్రీకరమైన మాసం కూడా. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతీ సోమవారం శివపూజలు చేస్తే చాలా మంచిదని పండిుతులు చెబుతున్నారు. కాగా అధిక శ్రావణం అంటూ శూన్యం మాసం అంటారు.అందుకే ఆ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దని పండితులు చెబుతున్నారు. అంటే వివాహాలు, ఉపనయనాలు, గృహ నిర్మాణాలు, భూమి పూజలు, కొత్త ప్రాజక్టులు వంటివి చేయవద్దని సూచిస్తున్నారు.