Uttar Pradesh : యూపీ ఎన్నికల్లో క్లైమాక్స్.. చిట్టచివరి పోలింగ్ ప్రారంభం

నేటితో ఐదు రాష్ట్రాలకు సంబంధించి రెండు నెలలుగా జరుగుతున్న పోలింగ్ పక్రియ పూర్తి కానుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

Up Election

Uttar Pradesh Election 2022 : దేశమంతా ఉత్కంఠగా, అంతకు మించిన ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. యూపీలో అధికారం ఎవరిదో తేల్చబోయే చిట్టచివరి దశ పోలింగ్‌ సోమవారం జరుగుతోంది. పూర్వాంచల్‌లో తొమ్మిది జిల్లాల్లోని 54 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఆజంగఢ్, మీర్జాపూర్‌, మౌవ్‌, జాన్‌పూర్‌, ఘాజీపూర్‌, చన్‌దౌలి, భదోహి, సోన్‌భద్ర జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతోంది. ఈసారి బరిలో 613 మంది అభ్యర్థులు ఉండగా.. 2 కోట్లకు పైగా మంది ఓటర్లు ఓటు వేయనున్నారు.

Read More : Uttar Pradesh : ఉత్తర్ ప్రదేశ్ లో ప్రారంభమైన రెండో దశ పోలింగ్

ప్రధాని నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో కూడా ఈ విడతలోనే పోలింగ్ జరుగుతుండడంతో.. బీజేపీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2017లో ప్రస్తుతం చివరి దశ ఎన్నికలు జరుగుతున్న 54 నియోజకవర్గాల్లో 29 బీజేపీ ఖాతాలో వేసుకోగా, సమాజ్ వాదీ పార్టీ 11, అప్నాదళ్ 4, ఎబీఎస్పీ 3 సీట్లు గెలుచుకున్నాయి. ఉత్తర్ ప్రదేశ్లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత ఆరు విడతల్లో 349 సీట్లలో ఓటింగ్ ముగిసింది. ఇవాళ రాత్రి 7 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. నేటితో ఐదు రాష్ట్రాలకు సంబంధించి రెండు నెలలుగా జరుగుతున్న పోలింగ్ పక్రియ పూర్తి కానుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.

Read More : UP Election 2022: నేడే యూపీ 5వ దశ పోలింగ్.. ఇప్పటివరకు ఎన్ని స్థానాలకు ఓటింగ్ జరిగిందంటే?

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికలు ఉత్తర్‌ప్రదేశ్. 2022 మేలో అసెంబ్లీ గడువు ముగుస్తుంది. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో గెలుపు బీజేపీకి అత్యవసరం. ఓ రకంగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పు.. సార్వత్రిక ఎన్నికల గమనాన్ని నిర్దేశించనుంది. యూపీలో నామినేటడ్ స్థానంతో కలిపి మొత్తం 404 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ 202. రైతు ఉద్యమం, ఐదేళ్లలో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అత్యాచార ఘటనలు, దిగజారిన శాంతి భద్రతలు బీజేపీ విజయంపై ప్రభావం చూపుతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సెకండ్ వేవ్ విజృంభణ, కరోనా మరణాలు ఎక్కువగా ఉండడం ప్రభుత్వ వైఫల్యమే అని ప్రతిపక్షాలు ఆరోపిస్తన్నాయి. అయితే లక్నో సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం, మెట్రో సర్వీసులు, రహదారుల విస్తరణ వంటి అభివృద్ధికార్యక్రమాలు, కాశీ ఆలయం విస్తరణ, అయోధ్య రామాలయం బీజేపీకి ఓట్ల వర్షం కురిపిస్తుందన్న భావనలో ఉన్నారు కమలం నేతలు.

Read More : UP : యూపీలో మమతకు షాక్.. నల్లజెండాలతో నిరసన

ఉత్తర్‌ప్రదేశ్ :-
మొత్తం స్థానాలు 404
ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాలు 202
అధికారంలో బీజేపీ
బీజేపీకి 303 స్థానాలు

Read More : UP Elections: యూపీ మూడో దశ పోలింగ్.. 16జిల్లాల్లో 59 అసెంబ్లీ స్థానాలకు..

ఎస్పీకి 49 స్థానాలు
బీఎస్పీకి 15 స్థానాలు
కాంగ్రెస్‌కు 7 స్థానాలు
ఒంటరిగా పోటీచేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ
మిత్రపక్షాలతో కలిసి పోటీచేస్తున్న ఎస్పీ