UP Elections: యూపీ మూడో దశ పోలింగ్.. 16జిల్లాల్లో 59 అసెంబ్లీ స్థానాలకు..

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ రేపు(20 ఫిబ్రవరి 2022) జరగబోతుంది.

UP Elections: యూపీ మూడో దశ పోలింగ్.. 16జిల్లాల్లో 59 అసెంబ్లీ స్థానాలకు..

5stateselections..with Uup

UP Assembly Elections Third Phase: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ రేపు(20 ఫిబ్రవరి 2022) జరగబోతుంది. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. మూడవ దశలో, రాష్ట్రంలోని 16 జిల్లాల్లోని 59 అసెంబ్లీ నియోజకవర్గాలలో, మైన్‌పురి జిల్లాలోని కర్హాల్ అసెంబ్లీ స్థానం కూడా ఉంది.

ఇక్కడ అధికార BJP కేంద్ర మంత్రి ప్రొఫెసర్ SP సింగ్ బఘెల్, ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ముఖాముఖిగా పోటీ పడుతున్నారు. మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్ ప్రాంతం నుంచి తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ పోటీ పడుతున్నారు.

మెయిన్‌పురి జిల్లాతో పాటు హత్రాస్, ఫిరోజాబాద్, ఎటా, కస్గంజ్, ఫరూఖాబాద్, కన్నౌజ్, ఇటావా, ఔరయ్యా, కాన్పూర్ దేహత్, కాన్పూర్ నగర్, జలౌన్, ఝాన్సీ, లలిత్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 627 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

2017లో బీజేపీ హవాలో కూడా ఎస్పీకి చెందిన సోబ్రాన్ సింగ్ యాదవ్ ఈ స్థానంలో విజయం సాధించారు. అఖిలేష్‌పై బీజేపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి ప్రొఫెసర్‌ ఎస్‌పీ సింగ్‌ బఘెల్‌ బరిలోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఏ నియోజకవర్గాన్ని ‘కోట’ లేదా ‘గఢ్’ అని పిలవలేమని బఘెల్ ఇప్పటికే వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బఘేల్ తరపున కర్హల్‌లో ప్రచారం చేశారు.

2017లో మూడో దశలో పోటీ జరిగిన 59 స్థానాలకు గానూ బీజేపీ 49 స్థానాలు గెలుచుకోగా, ఎస్పీ కేవలం తొమ్మిది సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్‌కు ఒక్క సీటు దక్కగా.. బహుజన సమాజ్‌ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.

మూడో దశలో రెండు కోట్ల 15 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో ఒక కోటి 16 లక్షలకు పైగా పురుష ఓటర్లు, 99 లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఉండగా, వెయ్యి మందికి పైగా ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు.

ఫిబ్రవరి 10న తొలి దశలో 58 స్థానాలకు, ఫిబ్రవరి 14న రెండో దశలో 55 స్థానాలకు పోలింగ్‌ పూర్తయింది. రాష్ట్రంలో ఏడు దశల అసెంబ్లీ ఎన్నికల్లో ఏడో దశ పోలింగ్ మార్చి 7న జరగనుంది. ఫలితాలు మార్చి 10న రానున్నాయి.