UP Assembly Election 2022 : యూపీలో నాలుగో విడత.. 57.45 శాతం పోలింగ్ నమోదు

యూపీలో నాలుగో విడత పోలింగ్ ముగిసింది... సాయంత్రం 5 గంటల వరకు 57.45 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Uttar Pradesh Fourth Phase Election 57.45% : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా యూపీలో నాలుగో విడత పోలింగ్ ముగిసింది. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. పిలిభిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలీ, బందా, ఫతేపూర్ జిల్లాల్లోని మొత్తం 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ దశలో మొత్తం 624 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకే ఓటు వేయడానికి క్యూ లైన్ లో నిలిచి ఉన్నారు. దీంతో భారీగా ఓటింగ్ శాతం నమోదవుతుందని అంచనా వేసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 57.45 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 2017 ఎన్నికల్లో 62.55 శాతం పోలింగ్ నమోదు కాగా… 2019లో 60.03 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2.3 కోట్ల మంది ఓటర్లున్నారు. వీరిలో 1.14 కోట్ల మంది పురుషులుంటే..99.3 లక్షల మంది మహిళా ఓటర్లున్నారు. మొత్తం 13 వేల 817 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Read More : UP Election 2022: నేడే యూపీలో 59స్థానాల్లో పోలింగ్.. లఖింపూర్ ఖేరీ, రాయ్‌బరేలీలో కూడా!

అధికార పీఠాన్ని నిలుపుకోవాలని బీజేపీ, ఎలాగైనా పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎస్పీ వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ప్రచారం కూడా అదే విధంగా చేస్తున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తుండడంతో రాజకీయాలు రంజుగా మారాయి. బీజేపీ వైఫల్యాలను ఎస్పీ కూటమి ప్రస్తావిస్తూ.. ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బీజేపీ పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. BSP అధ్యక్షురాలు మాయావతి అనేక ర్యాలీలు నిర్వహించి, SP, BJP మరియు కాంగ్రెస్‌లను తిరస్కరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. BSP మాత్రమే రాష్ట్ర ప్రజలకు నిజమైన సుపరిపాలన అందించగలదని చెబుతున్నారు. కాంగ్రెస్ కూడా ప్రచారం ముమ్మరంగా చేపడుతోంది. పార్టీ ఉత్తర్ ప్రదేశ్ ఇన్ చార్జి ప్రియాంక గాంధీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

Read More : UP election 2022 : మోడీ-యోగి సర్కార్‌ను ఏకిపారేసిన సోనియా గాంధీ.. ఇక దిగిపోండి.. యూపీ ప్రజలు కళ్లు తెరిచారు!

నాలుగో దశ.. అభ్యర్థులు వీరే
నాల్గో దశలో ప్రముఖ అభ్యర్థులలో రాష్ట్ర న్యాయ మంత్రి బ్రిజేష్ పాఠక్(లక్నో కాంట్), మంత్రి అశుతోష్ టాండన్(లక్నో ఈస్ట్), మాజీ మంత్రి ఎస్పీ అభ్యర్థి అభిషేక్ మిశ్రా(సరోజినీ నగర్), ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ నితిన్ అగర్వాల్ (హర్దోయ్), నెహ్రూ-గాంధీ కుటుంబానికి ‘కంచుకోట’గా భావించే రాయ్‌బరేలీలో కూడా నాలుగో దశలోనే ఓటింగ్ జరగనుంది. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన అదితి సింగ్ మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. మార్చి 10వ తేదీన ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు