Uttar Pradesh: హెలికాప్టర్లతో ఆందోళనలను పసిగట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లో జరిగే ఆందోళనలను క్షణాల్లో పసిగట్టేందుకు గానూ రాష్ట్రప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఆందోళనలకు పాల్పడేవారిని హెలికాప్టర్లతో పాటు నయా టెక్నాలజీ సాయంతో కనిపెట్టనున్నారు. ఈ మేరకు యూకేకు చెందిన ఎయిర్‌బస్ హెలికాప్టర్ ను రంగంలోకి దింపనున్నారు.

హింస, ఆందోళనలను పసిగట్టేందుకు యూపీ ప్రభుత్వం కీలక మార్పులకు తెరలేపింది. వీటి కారణంగా లా అండ్ ఆర్డర్ సరిగ్గా మెయింటైన్ చేయగలమనే విశ్వాసం వ్యక్తం చేసింది.

ఇప్పటికే ఆందోళనకారులు, మాఫియా వ్యక్తులు, సంఘ విద్రోహ శక్తులపై బుల్డోజర్ యాక్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. అదే సమయంలో హెలికాప్టర్లతో అల్లర్లను పసిగడితే క్షణాల్లో ఆందోళనలను అడ్డుకోగలమని చెప్తున్నారు. యూకే డిఫెన్సివ్ అండ్ సెక్యూరిటీ ఎక్స్‌పోర్ట్స్, బ్రిటిష్ హై కమిషన్, ఎయిర్‌బస్ హెలికాప్టర్స్ అఫీషియల్స్ కలిసి అడిషనల్ చీఫ్ సెక్రటరీ అవనీశ్ కుమార్ అవస్తీ ఎదుట ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు.

Read Also : ఉత్తరప్రదేశ్ లో కిసాన్ మహా పంచాయత్

టూరిజం, పోలీసింగ్ లతో పాటు హెలికాప్టర్లను ఆందోళనలను అడ్డుకోవడానికి, ప్రకృతి వైపరీత్యాలు, మెడికల్ ఎమర్జెన్సీలు, నక్సల్ ఏరియాల్లో హింస నుంచి కాపాడటానికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఎయిర్‌బస్ నుంచి ప్రపోజల్ రాగానే రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ల ఉపయోగం మొదలుపెట్టనుంది.

లా అండ్ ఆర్డర్ ఆపరేషన్స్ కోసమే కాదని, రిలీఫ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం కూడా హెలికాప్టర్ సర్వీసులను వినియోగించనున్నట్లు హోం డిపార్ట్‌మెంట్ అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, మహమ్మారి సమయంలో మెడిసిన్ పంపిణీ వంటి వాటికి వినియోగిస్తామని అంటున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు