UP Election : యూపీలో రాజీనామాల కలకలం..మరో మంత్రి కూడా

కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో..మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తుండడం అధికార పార్టీకి గుబులు పుట్టిస్తోంది. దేశ రాజకీయాలను మలుపుతిప్పుతాయని

Up Election

Uttar Pradesh Minister Dara Singh : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో..మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తుండడం అధికార పార్టీకి గుబులు పుట్టిస్తోంది. దేశ రాజకీయాలను మలుపుతిప్పుతాయని భావిస్తున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార బీజేపీకి ఊహించని షాక్‌ లు తగులుతున్నాయి.

Read More : Ashu Reddy: హాట్‌నెస్ మీ కళ్ళలో ఉంది.. నా థైస్‌లో కాదు!

యోగి కేబినెట్‌లో మంత్రి, ఓబీసీ కీలక నేత స్వామి ప్రసాద్‌ మౌర్య కాషాయపార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఆయన బాటలోనే మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీని వదిలి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఈ షాక్ నుంచి తేలుకోకముందే…మరో మంత్రి రాజీనామా చేశారు. మంత్రి పదవికి ధారాసింగ్ చౌహాన్ రాజీనామా చేశారు. దళితులు, ఓబీసీలు, రైతులు, నిరుద్యోగ యువతను బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య చేస్తోందంటూ..ఆయన రాజీనామా చేయడం గమనార్హం.

Read More : Tammareddy Bharadwaj : సినిమా ఇండస్ట్రీలో అందరూ ధైర్యవంతులే..పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఒకేసారి మంత్రి, నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో కాషాయదళంలో కలవరం మొదలైంది. మరో 13 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే ఎస్పీ గూటికి చేరనున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ పేర్కొనడం కమలనాథులకు మరింత గుబులు పుట్టిస్తోంది.