Chandrayan-3 : మహిళలకు ఉపాధినిస్తున్న చంద్రయాన్-3

చంద్రయాన్-3 సూపర్ సక్సెస్ కావటంతో యావత్ భారతం పొంగిపోయింది. ప్రపంచమంతా భారత్ వైపే చూసేలా చేసిన చంద్రయాన్ -3 ఇప్పుడు ఎంతోమందికి ఉపాధి మార్గంగా మారింది. అదెలా అంటే..

Chandrayan-3 Crafts

Chandrayan -3 Wood Crafts : చంద్రయాన్‌-3. ప్రపంచ దేశాల్లో ఇండియాకు ఎనలేని పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది. యావత్ ప్రపంచాన్ని భారత్ వైపు చూసేలా చేసింది. ఇస్రో శాస్త్రవేత్తల ప్రతిభా పాటవాలు ప్రపంచాన్ని నివ్వెరపరిచేలా చేసింది. అటువంటి చంద్రయాన్ -3  వారణాశిలోని కొందరు కళాకారులకు ఉపాధినిస్తోంది. చంద్రయాన్‌ ప్రయోగం జాబిల్లిపైకి మానవులు వెళ్లేందుకు ఆశలు పుట్టిస్తే.. దాని స్ఫూర్తిగా వారణాసిలో కొందరు కళాకారులు తయారు చేస్తున్న క్రాఫ్ట్‌లు దేశవ్యాప్తంగా ప్రజాదరణ చూరగొంటున్నాయి.

చంద్రయాన్‌ సక్సెస్‌తో కలపతో స్పేస్‌ క్రాఫ్ట్‌లు తయారు చేస్తున్నారు ఉత్తరప్రదేశ్  వారణాశిలోని కొందరు మహిళలు. కళాకారులు తయారు చేస్తున్న ఈ కలప నమూనాలు ఒక్కోటి 700 రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇవి దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు విదేశాలకు కూడా సరఫరా చేస్తున్నారు. సింగపూర్‌తో సహా దేశంలోని అనేక మెట్రోపాలిటన్ నగరాల నుండి వారణాశి కళాకారులకు ఆర్డర్‌లు వస్తున్నాయి. దీంతో వారికి చక్కటి ఉపాధి లభిస్తోంది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ నమూనాను తయారు చేశామని దీనికి మంచి స్పందన రావటంతో మాకు చక్కటి ఉపాధి మార్గాలు దొరికాయని ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

తాము తయారు చేసిన ఈ చంద్రయాన్‌ మోడళ్లను ప్రధాని మోదీతో పాటు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌కు బహూకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని కళాకారులు తెలిపారు.

చంద్రయాన్-3 మోడల్ తయారీలో ఎక్కువమంది మహిళలే ఉన్నారు. ఒక్కో చంద్రయాన్ ను తయారు చేయటానికి మూడు నుంచి నాలుగు రోజులు పడుతుందని క్రాఫ్ట్ డిజైనర్ బీహారీ లాల్ అగర్వాలు చెబుతున్నారు. చంద్రయాన్ -3 దేశానికే గర్వకారణంగా మారటమే కాకుండా చక్కటి ఉపాధి మార్గంగా తయారైందని తెలిపారు. ఇది దేశంతో పాటు వారణాశికి కూడా గర్వకారణమని తెలిపారు. చంద్రయాన్-3 మోడల్ డిజైన్ కు మంచి డిమాండ్ ఉందని దీనికి తమకు వస్తున్న ఆర్డర్లే నిదర్శనమని తెలిపారు.

 

 

ట్రెండింగ్ వార్తలు