Women Constables Dance : ఇదేందయ్యా ఇది.. పోలీస్ స్టేషన్‌లోనే ఆ పని చేసిన మహిళా కానిస్టేబుళ్లు, ఉన్నతాధికారులు సీరియస్

సరదాగా చేశారో పాపులారిటీ కోసం చేశారో, వైరల్ అయిపోదామనుకున్నారో తెలీదు.. కానీ, ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు డ్యాన్స్ చేయడం దుమారం రేపింది. డ్యాన్స్ చేస్తే తప్పేంటి? లేడీ కానిస్టేబుల్స్ అయితే డ్యాన్స్ చేయకూడదా? అనే సందేహం రావొచ్చు.

Women Constables Dance : ఈ మధ్య కాలంలో అందరికీ వీడియోల పిచ్చి బాగా పట్టుకుంది. ఏ పని చేసినా దాన్ని వీడియో తీయడం, సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం. రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోవాలని కలలు కనడం. వీడియోలకు వచ్చే లైకులు, వీడియోలు చూసుకుని మురిసిపోవడం. తాము ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము అనేది బొత్తిగా మర్చిపోయి వీడియోలు చేయడంలో మునిగిపోతున్నారు. కట్ చేస్తే.. కాంట్రవర్సీకి కారణం అవుతున్నారు. తాజాగా పోలీస్ స్టేషన్ లోనే మహిళా కానిస్టేబుళ్లు డ్యాన్స్ చేయడం వివాదానికి దారితీసింది.

Also Read..Women Constables Suspend : అయోధ్య రామ మందిరం నిర్మాణ ప్రాంతంలో డ్యాన్సులు.. నలుగురు మహిళా కానిస్టేబుళ్లు సస్పెండ్

సరదాగా చేశారో పాపులారిటీ కోసం చేశారో, వైరల్ అయిపోదామనుకున్నారో తెలియదు..కానీ, ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు డ్యాన్స్ చేయడం దుమారం రేపింది. డ్యాన్స్ చేస్తే తప్పేంటి? లేడీ కానిస్టేబుల్స్ అయితే డ్యాన్స్ చేయకూడదా? అనే సందేహం రావొచ్చు. నిజమే.. వాళ్లు డ్యాన్స్ చేయడంలో తప్పు లేదు. కానీ, వాళ్లు చేసిన ప్లేస్ రాంగ్. పోలీస్ స్టేషన్ లోనే ఆ లేడీ కానిస్టేబుల్స్ ఇలా డ్యాన్స్ చేయడం విమర్శలకు తావిచ్చింది.

ముగ్గురు లేడీ కానిస్టేబుళ్లు.. ఓ భోజ్ పురి పాటకు సరదాగా డ్యాన్స్ చేశారు. పాటకు అనుగుణంగా కాలు కదిపారు. డ్యాన్స్ చేయడమే కాదు అంతా వీడియో తీయించారు. ఆ తర్వాత వీడియోని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఉత్తరప్రదేశ్ కుషినగర్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. వీడియో అలా అప్ లోడ్ చేశారో లేదు, ఇలా వైరల్ అయిపోయింది.

Also Read..Andhra-pradesh : లేడీ కానిస్టేబుల్ కోసం కొట్టుకున్న సీఐ, కానిస్టేబుల్

లేడీ కానిస్టేబుళ్లు డ్యాన్స్ ఇరగదీశారు. అందులో డౌట్ లేదు. కానీ, పోలీస్ స్టేషన్ లో ఇలాంటి పని చేయడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఆ ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు. వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. పాపం ఆ మహిళా కానిస్టేబుళ్లు.. ఏదో సరదా కోసం చేసిన డ్యాన్స్ ఇలా చిక్కులు తెచ్చిపెడుతుందని అస్సలు ఊహించలేదు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.