ఊహించని ఘోరం : అంత్యక్రియలకు వెళ్తూ 8మంది మరణం

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ లో 8 మంది చనిపోయారు. ఒకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చమోలీ జిల్లా ఘేస్

  • Publish Date - October 14, 2019 / 04:54 AM IST

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ లో 8 మంది చనిపోయారు. ఒకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చమోలీ జిల్లా ఘేస్

ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ లో 8 మంది చనిపోయారు. ఒకరి ఆచూకీ తెలియాల్సి ఉంది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చమోలీ జిల్లా ఘేస్ గ్రామం దగ్గర ఈ ఘటన జరిగింది. దేవల్ గ్రామంలో అంత్యక్రియలకు 14 మందితో వెళ్తున్న జీపు అదుపుతప్పి లోయలో పడింది. దీంతో 8 మంది స్పాట్ లోనే మరణించారు. డ్రైవర్ సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

మృతులను జస్బీర్ సింగ్ (32), సురేంద్ర సింగ్(30), మదన్ సింగ్(60), దర్బాన్ సింగ్(48), కైలాష్ సింగ్ (40), గోపాల్ సింగ్(35), ధరమ్ సింగ్(55)గా గుర్తించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ గవర్నర్ బేబీ రాణీ మౌర్య, సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం విచారణకు ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. 8 మంది చనిపోవడంతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు.