Ankita Bhandari Murder Case: పులకిత్ ఆర్య అరెస్ట్ అనంతరం తండ్రిని, సోదరుడిని పార్టీ నుంచి బహిష్కరించిన బీజేపీ

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పులకిత్ ఆర్యకు చెందిన రిసార్ట్‌ను కూల్చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు. ఇక దీనిపై బీజేపీ కూడా స్పందించి పులకిత్ ఆర్య సోదరుడు అంకిత్ ఆర్యను, వీరి తండ్రి వినోద్ ఆర్యను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే.. పులకిత్ ఆర్యకు చెందిన ఒక రాసార్టుకు నిరసన కారులు నిప్పు పెట్టి ఆందోళనను మరింత తీవ్రం చేశారు.

Ankita Bhandari Murder Case: 19 ఏళ్ల యువతి మరణం కేసులో పులకిత్ ఆర్య అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. కాగా, ఈ కేసు విషయంలో ఇద్దరు బీజేపీ నేతలపై వేటు పడింది. పులికత్ తండ్రి తండ్రి వినోద్ ఆర్య, సోదరుడు అంకిత్ ఆర్యలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసనలు లేనెత్తడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అంతే కాకుండా, పులకిత్ ఆర్యకు చెందిన రిసార్టుపై ప్రభుత్వం బుల్డోజర్లు ప్రయోగించి కూల్చివేసింది.

విషయంలోకి వెళ్తే.. పులకిత్ ఆర్యకు యమకేశ్వర్‌లో ఓ రిసార్ట్ ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రిసెప్షనిస్ట్‌గా పని చేస్తున్న 19 ఏళ్ళ యువతి సెప్టెంబరు 18న అదృశ్యమైంది. అనంతరం హత్యకు గురైంది. ఈ కేసులో పులకిత్ ఆర్యతో పాటు రిసార్టులో పని చేస్తున్న సౌరభ్ భాస్కర్, అంకిత్ గుప్తా అనే ఇద్దరు మేనేజర్లను శుక్రవారం అరెస్టు చేశారు. వీరిని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. ఆమె తండ్రి కథనం ప్రకారం ఆమెను నిందితులు లైంగికంగా వేధించి హతమార్చారని చెప్పారు.

ఈ విషయం బయిటికి రావడంతోనే రాష్ట్రంలో పెద్ద దుమారంగా మారింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పులకిత్ ఆర్యకు చెందిన రిసార్ట్‌ను కూల్చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆదేశించారు. ఇక దీనిపై బీజేపీ కూడా స్పందించి పులకిత్ ఆర్య సోదరుడు అంకిత్ ఆర్యను, వీరి తండ్రి వినోద్ ఆర్యను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే.. పులకిత్ ఆర్యకు చెందిన ఒక రాసార్టుకు నిరసన కారులు నిప్పు పెట్టి ఆందోళనను మరింత తీవ్రం చేశారు.

UP: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల తీరు.. ఆన్‭లైన్‭లో పేకాడుతూ ఒకరు.. హౌజ్‭లోనే పొగాకు తింటూ మరొకరు

ట్రెండింగ్ వార్తలు