UP: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల తీరు.. ఆన్లైన్లో పేకాడుతూ ఒకరు.. హౌజ్లోనే పొగాకు తింటూ మరొకరు
తాజాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ నేతలు కూడా వింత కార్యకలాపాలు చేస్తూ కెమెరాకు చిక్కారు. సభ కొనసాగుతుంటూ ఒక ఎమ్మెల్యేనేమో చాలా సీరియస్గా పేకాటాడుతుండగా.. మరొక ఎమ్మెల్యే ఏకంగా అసెంబ్లీలోకే తంబాకు తెచ్చుకున్నారు. సభలోనే తంబాకు నమిలారు. వీరిద్దరి వీడియోలను సమాజ్వాదీ పార్టీ సోషల్ మీడియాలో బహిర్గత పర్చింది.

BJP MLAs in UP assembly one person playing online rummy and other one is consume tobacco
UP: చట్ట సభల్లో తమ గొంతు వినిపిస్తారని, తమ అవసరాలు తీర్చుతారని నాయకులకు ప్రజలు ఓట్లేసి చట్ట సభలకు పంపిస్తారు. కానీ అదే చట్ట సభల్లో కొంతమంది ప్రజాప్రతినిధులు చేసే విచిత్ర కార్యకలాపాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరు నిద్రపోతుంటారు, కొందరు వ్యక్తిగత పనులు చేసుకుంటుంటారు, కొందరు ఫోన్లు చూస్తుంటారు. కొందరు తమకేదీ పట్టనట్లు ఊరికే అలా హాజరవుతారు కానీ, ఎప్పుడూ ఏదీ మాట్లాడరు. ఇలాంటి వారు కాకుండా.. చట్ట సభల్లో పోర్న్ వీడియోలు చూసిన బాగోతాలు కూడా ఉండనే ఉన్నాయి. ఆ మధ్య కర్ణాటక, బెంగాల్ అసెంబ్లీల్లో సభ్యులు పోర్న్ చూస్తూ పట్టుబడ్డారు.
తాజాగా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ నేతలు కూడా వింత కార్యకలాపాలు చేస్తూ కెమెరాకు చిక్కారు. సభ కొనసాగుతుంటూ ఒక ఎమ్మెల్యేనేమో చాలా సీరియస్గా పేకాటాడుతుండగా.. మరొక ఎమ్మెల్యే ఏకంగా అసెంబ్లీలోకే తంబాకు తెచ్చుకున్నారు. సభలోనే తంబాకు నమిలారు. వీరిద్దరి వీడియోలను సమాజ్వాదీ పార్టీ సోషల్ మీడియాలో బహిర్గత పర్చింది.
सदन की गरिमा को तार-तार कर रहे भाजपा विधायक!
महोबा से भाजपा विधायक सदन में मोबाइल गेम खेल रहे, झांसी से भाजपा विधायक तंबाकू खा रहे।
इन लोगों के पास जनता के मुद्दों के जवाब हैं नहीं और सदन को मनोरंजन का अड्डा बना रहे।
बेहद निंदनीय एवं शर्मनाक ! pic.twitter.com/j699IxTFkp
— Samajwadi Party (@samajwadiparty) September 24, 2022
ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. అసెంబ్లీ కొనసాగుతోంది. ఒక మహిళా సభ్యురాలు సభలో ప్రసంగిస్తున్నారు. ఈ సమయంలో మహోబా అసెంబ్లీ నియోజకవర్గ సభ్యుడు మొబైల్లో తీన్ పత్తా (ఒకరకమైన పేకాట) ఆడుతుండడం వీడియోలో చూడొచ్చు. ఇక ఝాన్సీకి చెందిన మరొక బీజేపీ ఎమ్మెల్యే.. సభలోనే తంబాకు నోట్లో వేసుకోవడం చూడొచ్చు. దీనిపై ఎస్పీ ట్విట్టర్ ఖాతాలో ‘‘ప్రజల సమస్యలకు వీళ్లు సమాధానాలు ఇవ్వరు. పైగా అసెంబ్లీ వీరికి వినోద ప్రదేశంగా ఉండాలనుకుంటారు. చాలా అసహ్యకరమైన ఘటన ఇది. రాష్ట్రానికి చాలా అవమానకరం’’ అని ట్వీట్ చేశారు.
Lalu Yadav: నితీశ్తో కలిసి సోనియాను కలవనున్న లాలూ.. బీజేపీని కూకటి వేళ్లతో పెకిలిస్తామని ప్రకటన