Uttarakhand Speaker revokes 228 ad-hoc appointments in Vidhan Sabha Secretariat
Uttarakhand: ఉత్తరాఖండ్ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 228 మందికి ఇచ్చిన అడ్-హాక్ అపాయింట్మెంట్స్ నియామకాలన్నింటినీ రద్దు చేశారు. అంతే కాకుండా శాసన సభ కార్యదర్శి ముకేశ్ సింఘాల్‌ను సస్పెండ్ చేశారు. రితు ఖండూరీ శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, శాసన సభ సచివాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ఈ నియామకాలు జరిగాయని, అందుకే వాటిని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
2016, 2020, 2021 సంవత్సరాల్లో ఈ నియామకాలు జరిగాయి. వీరిలో 150 మంది 2016లో, ఆరుగురు 2020లో, 72 మంది 2021లో నియమితులయ్యారని స్పీకర్ రీతూ ఖండూరి తెలిపారు. శాసన సభ కార్యదర్శి ముకేశ్ సింఘాల్‌పై వేసిన వేటు తక్షణమే అమలయ్యే విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ముగ్గురు నిపుణులతో కూడిన కమిటీ సిఫారసుల ఆధారంగా ఈ నియామకాలను రద్దు చేసినట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ నియామకాలు జరిగినట్లు ఈ కమిటీ గుర్తించిందని చెప్పారు. ఈ నివేదిక గురువారం రాత్రి తనకు అందిందని తెలిపారు. తన నిర్ణయానికి ఆమోదం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే తెలియజేశానని చెప్పారు.
UP: అత్యాచార నిందితులపై యోగి ప్రభుత్వం కొరడా.. ముందస్తు బెయిల్ నిరాకరించే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం