Vaccination Drive : తౌక్టే తుఫాన్ ఎఫెక్ట్, వ్యాక్సినేషన్‌కు బ్రేక్

తౌటే తుఫాన్ ఎఫెక్ట్ కరోనా వ్యాక్సినేషన్‌పై పడింది. పలు రాష్ట్రాలు ఈ తుఫాన్ కారణంగా..అతలాకుతలమౌతున్నాయి.

Mumbai : తౌక్టే తుఫాన్ ఎఫెక్ట్ కరోనా వ్యాక్సినేషన్‌పై పడింది. పలు రాష్ట్రాలు ఈ తుఫాన్ కారణంగా..అతలాకుతలమౌతున్నాయి. ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు తాత్కాలికంగా నిలిపివేయాలని బృహన్ ముంబై నగర పాలిక కీలక నిర్ణయం తీసుకుంది.

తుఫాన్ కారణంగా..సోమవారం వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు తుఫాన్ పరిస్థితిని సీఎం ఉద్దవ్ థాకరే, బృహన్ ముంబై మేయర్ కిశోరీ పెడ్నేకర్‌లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన కంట్రోల్ రూమ్‌ను మేయర్ పరిశీలించారు.

తౌక్టే తుఫాన్ తీవ్రతకు అనేక రాష్ట్రాలు అతలాకుతులమవుతున్నాయి. కర్నాటకలోని ఆరు జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ నుంచి అతి భారీ వరర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తీవ్రతకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 73గ్రామాలపై వర్ష ప్రభావం ఉందని కర్నాటక విపత్తు నిర్వహణ బృందం ప్రకటించింది. తౌక్టే తుఫాన్ తీవ్రతకు గోవాకు చిగురుటాకులా వణుకుతోంది. బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తుండడంతో గోవాలో అనేక చెట్లు విరిగిపడ్డాయి. సముద్ర తీర ప్రాంతంలో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి.

2021, మే 17వ తేదీ సోమవారం ఉదయం తుఫాన్ గుజరాత్ తీరాన్ని తాకుతుందని భావిస్తున్నారు. ఆ సమయంలోగంటకు 150 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సహాయక చర్యలకోసం NDRF 79 బృందాలను సిద్ధంగా ఉంచింది. ఆర్మీ, నావీ, తీర ప్రాంత రక్షకదళాలను మోహరించింది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు పూణె నుంచి నాలుగు NDRF బృందాలు అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లాయి.

Rerd More :  Kedarnath Temple : రేపు తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయద్వారాలు

ట్రెండింగ్ వార్తలు