Kedarnath Temple : రేపు తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయద్వారాలు
హిందువులు పవిత్రంగా భావించే హిమాలయ పర్వతాల్లోని ‘చార్‌ధామ్’ దేవాలయాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు రేపు తెరుచుకోనున్నాయి.

Kedarnath Temple
Kedarnath Temple హిందువులు పవిత్రంగా భావించే హిమాలయ పర్వతాల్లోని ‘చార్‌ధామ్’ దేవాలయాల్లో ఒకటైన కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు రేపు తెరుచుకోనున్నాయి. సోమవారం కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు తెరిచేందుకు ఉత్తరాఖండ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని పుష్పాలంకరణతో సర్వాంగసుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఆలయ అలంకరణ కోసం మొత్తం 11 క్వింటాళ్ల పూలను వినియోగించారు. కరోనా నేపథ్యంలో భక్తులకు ఆన్‌లైన్ ‘దర్శనం’ మాత్రమే ఉంటుంది.
ప్రతి ఏటా శీతాకాలంలో ఆరునెలల పాటు మూసి ఉండే చార్‌ధామ్ ఆలయాలు భక్తుల సందర్శనార్థం వేసవికాలంలో తెరుచుకుంటాయి. అయితే కరోనా కారణంగా గతేడాది, ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రను ఉత్తరాఖండ్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో గతేడాది నుంచి ఆన్‌లైన్ పోర్టల్స్ ద్వారా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
చార్‌ధామ్ యాత్రలో యమునోత్రి ఆలయాన్ని ముందు తెరుస్తారు. శుక్రవారం యమునోత్రి ఆలయాన్ని తెరిచారు.శనివారం గంగోత్రి ఆలయద్వారాలు తెరుచుకున్నాయి. సోమవారం కేదార్‌నాథ్, మంగళవారం బద్రీనాథ్ ఆలయాలను తెరవనున్నారు.