ఢిల్లీ వాసుల ఉక్కిరిబిక్కిరి  : వడగళ్ల వాన 

  • Publish Date - January 22, 2019 / 06:20 AM IST

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోను ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఈరోజు (జనవరి 22)తెల్లవారు ఝామునుండి  భారీ వర్షం కురుస్తోంది.  దీంతో ఢిల్లీవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్ లలో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో సుబాష్ నగర్ లో వడగళ్లు పడ్డాయి. ఉత్తరప్రదేశ్ లోని మీరట్, సీతాపూర్, లఖింపూర్, షామ్లీ, బాఘ్ పట్, ముజఫర్ నగర్, గౌతమబుద్ధ నగర్, ఘజియాబాద్ లలోనూ వానలు కురుస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. 21వ తేదీ అర్థరాత్రి నుంచి ఆకాశం మబ్బులు పట్టేయటంతో వర్షం భారీగా కురుస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు పొగమంచు కూడా తోడవ్వటంతో వాహనదారులు పలు సమస్యలకు గురవుతున్నారు. 

ఒకపక్క వర్షం..మరోపక్క శీతాకాలం కావటంతో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయి పొగమంచు పగమంచుగా మారి ప్రజలను నానా సమస్యలకు గురి చేస్తోంది. దీంతో హౌరా-న్యూ ఢిల్లీ పూర్వ ఎక్స్ప్రెస్, మాల్డా-ఢిల్లీ జంక్షన్ ఫరక్కా ఎక్స్ప్రెస్, ముంబై అమృత్సర్ ఎక్స్ ప్రెస్ లతో పాటు ఢిల్లీలో 15 రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తాయని ఉత్తర రైల్వేస్ తెలిపింది. విజిబులిటీ చాలా తక్కువగా ఉండడంతో విమనాల రాకపోకలు కూడా ఆలస్యమవుతున్నాయి. దీంతో ఎయిర్ పోర్ట్ లోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణీకులు రైళ్ల ఆలస్యంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాతావరణ ప్రభావంతో తలెత్తిని ఈ సమస్యలను ప్రయాణీకులు అర్థం చేసుకోవాలని రైల్వే, విమానయాన శాఖలు ప్రయాణీకులకు విజ్నప్తి చేశాయి.