లాక్ డౌన్ వేళ..చిన్న చిన్న గేమ్స వైపు దారి మళ్లుతున్నారు. పాతకాలపు నాటి ఆటలను మరలా ఇప్పుడు ఆడుతున్నారు. అష్టా చెమ్మ, గోళికాయలు, వైకుంఠపాళి, లూడో తదితర గేమ్స్ ఆడుతూ టైం పాస్ చేస్తున్నారు. కొన్ని ఇలాంటి గేమ్స్ ఆన్ లైన్ లో కూడా ఉన్నాయి. చాలా మంది గ్రూపులుగా విడిపోయి వీటిని ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ లూడో గేమ్ లో తరచూ తనను ఓడిస్తుందనే కోపంతో భార్యను చితకబాదాడు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో చోటు చేసుకుంది.
వడోదరలో ఓ మహిళ ట్యూషన్ చెబుతుంటుంది. ఈమె భర్త..ఓ ఎలక్ట్రానిక్ కంపెనీలో పని చేస్తున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండడంతో వీరు ఖాళీగా ఉన్నారు. టైం పాస్ కు లూడో గేమ్ ఆడడం ప్రారంభించారు. ఆన్ లైన్ లో వీరిద్దరూ గేమ్ ఆడడమే కాకుండా…కాలనీలో మరికొంత మంది జాయిన్ అయ్యారు. ఇక్కడ ప్రతిసారి తన భర్తను ఓడిస్తూ ఉండేది. దీనిని భరించలేకపోయాడు.
క్షణికావేశంలో ఆమెతో గొడవకు దిగాడు. తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె వెన్నెముక విరిగిపోయింది. బాధితురాలు ఫిర్యాదు చేయగా..పోలీసులు రంగ ప్రవేశం చేసి దాడి చేసిన భర్తను అదుపులోకి తీసుకున్నారు. భర్త క్షమాపణలు చెప్పడంతో కేసును వాపస్ తీసుకుంది. కానీ ఒక ఆట ముగింపు ఇలా ఉంటుందని ఎవరూ ఊహించలేదు.