‘Boy friend On Rent’ : ‘అద్దెకు బాయ్‌ఫ్రెండ్’.. ప్లకార్డుతో కుర్రాడు ఇచ్చే సందేశం తెలుసుకోవాల్సిందే!
మీకు బాయ్‌ఫ్రెండ్ కావాలా?..అద్దె ఇస్తే నేను రెడీ అంటున్నాడు ఓ కుర్రాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Yong Man ‘boyfriend On Rent’
‘Boy friend On Rent’ : ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులంతా కలిసి గిఫ్టులు ఇచ్చుకుంటారు. కొత్తగా ప్రపోజ్ చేయాలనుకునేవారు వారి ప్రేయసి లేదా ప్రియుడికి గిప్టు ఇచ్చి తమ ప్రేమను వెల్లడిస్తారు.ఇలా ప్రేమికులు జంటలు జంటలుగా తిరుగుతుంటారు ప్రేమికుల దినోత్సవం రోజున. కానీ చాకులాంటి ఓ కుర్రాడు మాత్రం ఓ వినూత్న ప్లకార్డు పట్టుకుని ఊరంతా తిరిగాడు ఒంటరిగా.
అదేమంటే మీకు బాయ్ ఫ్రెండ్ కావాలా? అయితే నేను రెడీ అంటున్నాడు. దాని కోసం ‘Boy friend On Rent’(రెంట్‌కు బాయ్‌ఫ్రెండ్ దొరుకును’ అంటూ ప్లకార్డ్ పట్టుకొని ఊరంతా తిరిగాడు. అతడిని చూసి అందరూ నవ్వుకున్నారు కానీ.. అతడు అలా చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. మరి ఆ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే..‘చదువుకోవాల్సిన వయస్సులో ప్రేమ అంటూ చాలామంది విద్యార్ధులు చదువుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఇది వారి జీవితాలను నాశనం చేస్తుందని అందుకే చదువుకునే వయస్సులో చదువుకోవాలని ప్రేమ అంటూ జీవితాలను పాడు చేసుకుని అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకోవద్దని తెలియజేయటానికే నేను ఇలాంటి ఆలోచన చేశానని తెలిపాడు.
బీహార్‌లోని దర్భంగాలో ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ప్రియాన్షు అనే విద్యార్థి మెడలో బాయ్‌ఫ్రెండ్ ఆన్ రెంట్ అంటూ బోర్డ్ పెట్టుకొని ప్రియాన్షు దర్భంగా మొత్తం తిరిగాడు. అక్కడ ఫోటోలకు పోజులిచ్చాడు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రేమికుల రోజు (ఫిబ్రవరి 14) వెళ్లిపోయినా ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా హల్ చల్ చేస్తునే ఉన్నాయి.