Viral Video: ఆత్రుతగా రోడ్డు దాటబోయిన యువకుడు.. కారు స్పీడుగా వచ్చి ఢీ కొడితే ఎగిరిపడి..

ఈ వీడియోను టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి పాదచారులకు సూచనలు చేశారు.

Viral Video

Viral Video – VC Sajjanar: రోడ్డుపై ఏదైనా వాహనం వస్తుందా? లేదా? అన్న విషయాన్నీ చూసుకోకుండా చాలా ఆత్రుతగా రోడ్డు దాటబోయాడు ఓ యువకుడు. అతడికి ఎడమవైపు నుంచి ఓ కారు స్పీడుగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఆ యువకుడు ఎగిరిపడ్డాడు. జమ్మూకశ్మీర్ ( Jammu and Kashmir )లోని శ్రీనగర్ (Srinagar)లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఈ వీడియోను టీఎస్ఆర్టీసీ (TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి పాదచారులకు సూచనలు చేశారు. ‘ తొందరగా వెళ్లాలని ఇలా ఆత్రంగా ప్రధాన రహదారులను అసలే దాటొద్దు. అజాగ్రత్తగా వల్ల విలువైన ప్రాణాలు పొగొట్టుకోవద్దు.

రహదారులపై పాదచారులు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రాణాలకే ప్రమాదం.. జాగ్రత్త. రెండు రోజుల క్రితం జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో జరిగిందీ ప్రమాదం ’ అని పేర్కొన్నారు.

కాగా, పాదచారులు, వాహనదారులు రోడ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తొందరగా వెళ్లాలన్న ప్రయత్నంలో సిగ్నల్ జంప్ చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ప్రమాదాలు కొనితెచ్చుకుంటూ, ఇతరులనై ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

Bengal: 8వ తరగతి విద్యార్థి కిడ్నాప్, హత్య.. తోటి పిల్లలే నిందితులు