Ventilation Belt : పీపీఈ కిట్‌లో వెంటిలేషన్‌

పీపీఈ కిట్లలోకి గాలి వెళ్లేలా..లోపలున్న వేడి బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ ‘కొవ్‌-టెక్‌ వెంటిలేషన్‌ సిస్టమ్‌’ను నడుము వద్ద పీపీఈ కిట్‌కు జత చేసుకోవచ్చు.

Sweating In PPE Kits : భారతదేశంలో కరోనా ఇంకా విజృంభిస్తోంది. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు వైద్యులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా..చికిత్స అందిస్తున్నారు. అయితే..కరోనా రోగులకు చికిత్స అందించే సమయంలో డాక్టర్లు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటోంది. అందులో ప్రధానమైంది పీపీఈ కిట్స్. ఈ కిట్ గంటల పాటు ధరించి చికిత్స అందిస్తున్నారు.

కానీ..ఈ కిట్ ధరించడం వల్ల డాక్టర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. గంటల తరబడి ఈ కిట్లు ధరించడం వల్ల వారు పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. లోపల గాలి ఆడదు, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

అందుకే నిపుణులు కొత్త ఆలోచన చేశారు. పీపీఈ కిట్లలోకి గాలి వెళ్లేలా..లోపలున్న వేడి బయటకు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ ‘కొవ్‌-టెక్‌ వెంటిలేషన్‌ సిస్టమ్‌’ను నడుము వద్ద పీపీఈ కిట్‌కు జత చేసుకోవచ్చు.

Read More : Warangal : వరంగల్ కు సీఎం కేసీఆర్

ట్రెండింగ్ వార్తలు