Actress Veena Kapoor : హిందీ సీరియల్ మాజీ నటి వీణాకపూర్ దారుణ హత్యకు గురయ్యారు. కన్నకొడుకే ఆమె కడతేర్చాడు. ఆస్తి గొడవలే ఇందుకు కారణం. బేస్ బాల్ బ్యాట్ తో తల్లి తలపై కొట్టి చంపేశాడు. ఆ తర్వాత పని వాడి సాయంతో తల్లి మృతదేహాన్ని నదిలో పారేశాడు. కొన్ని రోజులుగా వీణా కపూర్ కనిపించకపోవడంతో ఈ నెల 6న ఆమె అపార్ట్ మెంట్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాఫ్తులో షాకింగ్ నిజం వెలుగుచూసింది. కన్నకొడుకే తల్లిని మర్డర్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దాల్ ది గ్యాంగ్, బంధన్ ఫేరోన్ కే వంటి సీరియల్స్ లో వీణాకపూర్ నటించారు.
ఆస్తి కోసమే తల్లిని హత్య చేశానని విచారణలో నేరస్తుడు ఒప్పుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. వీణా కపూర్ హత్య వార్త బాలీవుడ్ టీవీ పరిశ్రమను షాక్ కి గురి చేసింది. వీణా కపూర్ వయసు 74ఏళ్లు. వీణా కపూర్ పేరు మీద ముంబైలో ఒక ఖరీదైన ప్లాట్ ఉంది. దాని విలువ సుమారు రూ.12 కోట్లు. దీనిపై ఆమె కొడుకు కన్నుపడింది. ఆ ప్లాట్‌ని తన పేరు మీద రాయమని తల్లి వీణా కపూర్ ని కొడుకు వేధించేవాడు. దీని గురించి పలుమార్లు గొడవలు జరిగాయి.
ఈ క్రమంలోనే హత్య జరిగిన రోజు కూడా.. తల్లీ కొడుకుల మధ్య.. ఆస్తి గురించి గొడవ జరిగింది. అప్పటికే తల్లి మీద కోపంతో రగిలిపోతున్న కొడుకు.. బేస్‌బాల్ బ్యాట్‌తో ఆమె తల మీద కొట్టి అత్యంత దారుణంగా హత్య చేశాడు.
ముంబైలోని జూహూ ప్రాంతంలో వీణా కపూర్ హత్య జరిగింది. వీణా కపూర్ అనే సీరియల్స్ లో నటించారు. సినిమాల్లో కూడా నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించారు. వీణాకపూర్ పెద్ద కుమారు అమెరికాలో ఉంటాడు. ఆస్తి విషయంలో తన తల్లితో గొడవలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే తాను ఆమెను హత్య చేసినట్లు రెండో కుమారుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని రాయ్ గఢ్ జిల్లా మధేరా దగ్గర నదిలో పారేసినట్లు చెప్పాడు.
వీణా హత్య వార్త తెలిసి ఆమె స్నేహితులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరం అన్నారు. వీణాకపూర్ తో కలిసి పలు సీరియల్స్ లో నటించిన నీలూ కోహ్లి.. తన స్నేహితురాలు వీణా కపూర్ హత్యను జీర్ణించుకోలేకపోతున్నారు. తనకు మాటలు రావడం లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా వీణాకపూర్ స్ట్రగుల్ అయ్యిందని, ఇకనైనా ఆమెకు ప్రశాంతత చేకూరాలని ఆశిస్తున్నా అని నీలూ కోహ్లి ట్వీట్ చేశారు.