M. Venkaiah Naidu
M. Venkaiah Naidu : కృష్ణా జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈరోజు రాత్రి గన్నవరం చేరుకున్నారు. చెన్నై నుండి ప్రత్యేక రైలులో రాత్రి గం.8.15 ని.లకు ఆయన గన్నవరం రైల్వే స్టేషన్ చేరుకున్నారు.
వెంకయ్య నాయుడుకి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శాలువా కప్పి, పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గం ద్వారా ఉంగుటూరు మండలం ఆత్కూరు లోని స్వర్ణభారతి ట్రస్ట్ కు బయలుదేరి వెళ్లారు.