Venkaiah Naidu: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్!

ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడుకి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

Venkaiah Naidu: వెంకయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఆదివారం (జనవరి 23) రాత్రి ట్విటర్ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించింది ఆయన కార్యాలయం. ఆయన వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు.

గతంలో కూడా వెంకయ్యనాయుడుకు కరోనా సోకింది. ఇది రెండోసారి. అప్పట్లో కూడా రొటీన్‌గా కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోగా.. ఆయనకు పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు కూడా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా వచ్చింది. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉండనుందని వెల్లడించింది కార్యాలయం.

ట్రెండింగ్ వార్తలు