Man Collapses While Dancing : షాకింగ్.. హుషారుగా డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటు.. అక్కడికక్కడే మృతి.. వీడియో వైరల్

మృత్యువు ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు, చెప్పలేరు. అప్పటివరకు బాగున్న మనిషి సడెన్ గా కన్నుమూయచ్చు. రెప్పపాటులో ప్రాణం గాల్లో కలిసిపోవచ్చు. ఉత్తరప్రదేశ్ లోని బారెల్లీలో అలాంటి షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది.

Man Collapses While Dancing : షాకింగ్.. హుషారుగా డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటు.. అక్కడికక్కడే మృతి.. వీడియో వైరల్

Updated On : September 3, 2022 / 12:42 AM IST

Man Collapses While Dancing : మృత్యువు ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు, చెప్పలేరు. అప్పటివరకు బాగున్న మనిషి సడెన్ గా కన్నుమూయచ్చు. రెప్పపాటులో ప్రాణం గాల్లో కలిసిపోవచ్చు. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో అలాంటి షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది.

ఓ వ్యక్తి బర్త్ డే పార్టీలో ఎంతో సంతోషంగా హుషారుగా డ్యాన్స్ చేస్తున్నాడు. అంతలోనే ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో అంతా షాక్ కి గురయ్యారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. డ్యాన్స్ చేస్తుండగానే అతడికి హార్ట్ ఎటాక్ వచ్చిందని, దీంతో అక్కడికక్కడే చనిపోయాడని డాక్టర్లు వెల్లడించారు.

కాగా, కొన్ని రోజులుగా ఈ తరహా ఘటనలు ఎక్కువ కావడం ఆందోళనకు గురి చేస్తోంది. చిన్న వయసు వారు కూడా ఊహించని విధంగా గుండెపోటుతో మరణించడం కామన్ గా మారింది.

బర్త్ డే పార్టీకి హాజరైన ఆ వ్యక్తి ఓ బాలీవుడ్ పాటకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్నాడు. హుషారుగా స్టెప్పులు వేస్తున్నాడు. పాటకు తగ్గట్టుగా ఎక్స్ ప్రెషన్లు కూడా ఇస్తున్నాడు. కాసేపు అలా డ్యాన్స్ చేశాడు. అతడి డ్యాన్స్ చూసి పార్టీకి వచ్చినోళ్లు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చప్పట్లు కొడుతూ అతడిని ప్రోత్సహించారు. ఇంతలోనే డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి సడెన్ గా కుప్పకూలిపోయాడు.

అంతే ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. ఏం జరిగిందోనని అంతా కంగారుపడ్డారు. దగ్గరికి వెళ్లి చూడగా ఆ వ్యక్తి చలనం లేకుండా పడున్నాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా అతడు హార్ట్ ఎటాక్ తో చనిపోయాడని డాక్టర్లు చెప్పడం మైండ్ బ్లాంక్ చేసింది. డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి సడెన్ గా కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసినోళ్లు అయ్యో పాపం అంటున్నారు.

 

డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటుతో మృతి..