Video: నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరి మృతి.. 24 గంటలుగా కొనసాగుతున్న శిథిలాల తొలగింపు..

భవన యజమాని ఎలాంటి అనుమతి లేకుండా పక్కనే ఉన్న ప్లాట్‌లో తవ్వకాలు జరపడంతో భవనం కూలిపోయినట్లు తెలుస్తోంది.

పంజాబ్‌లోని మొహాలీలో నిన్న సాయంత్రం నాలుగు అంతస్తుల భవనం కూలిపోలిపోయి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద ఎంత మంది ఉన్నారో ఇప్పటికీ తెలియరాలేదు. 24 గంటల నుంచి ఇండియన్ ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ (ఎన్డీఆర్‌ఎఫ్‌) బృందాలు పనిచేస్తూనే ఉన్నాయి. భవనం కుప్పకూలుతుండగా తీసిన వీడియో బయటకు వచ్చింది.

మృతి చెందిన వారిని థియోగ్‌కు చెందిన దృష్టి వర్మ, హరియాణాలోని అంబాలాకు చెందిన అభిషేక్‌గా పోలీసులు గుర్తించారు. వర్మను నిన్న రాత్రి శిథిలాల నుంచి బయటకు తీశారు. అయితే, ఆమె సోహానా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఇవాళ ఉదయం శిథిలాల నుంచి అభిషేక్ మృతదేహాన్ని వెలికితీశారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. భవన యజమాని ఎలాంటి అనుమతి లేకుండా పక్కనే ఉన్న ప్లాట్‌లో తవ్వకాలు జరపడంతో భవనం కూలిపోయినట్లు తెలుస్తోంది.

భవన యజమానులు పర్వీందర్ సింగ్, గగన్‌దీప్ సింగ్‌పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఫోన్‌లో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

CP CV Anand Warning : పోలీసులను టచ్ చేసినా వదిలేది లేదు- బౌన్సర్లకు సీపీ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్