CP CV Anand Warning : పోలీసులను టచ్ చేసినా వదిలేది లేదు- బౌన్సర్లకు సీపీ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్
భద్రత కల్పిస్తున్న పోలీసులను కూడా నెట్టేస్తున్నారు. ఇంకోసారి ఇలా చేస్తే బౌన్సర్లు, ఏజెన్సీలపై కఠిన చర్యలు ఉంటాయి

CP CV Anand Warning : బౌన్సర్లకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఓవరాక్షన్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు. ఇకపై పబ్లిక్ ను కానీ పోలీసులను కానీ టచ్ చేసినా వదిలేది లేదని సీపీ సీవీ ఆనంద్ తేల్చి చెప్పారు. సంధ్య థియేటర్ ఘటన సందర్భంగా బౌన్సర్లు వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. బౌన్సర్లను పెట్టే ఏజెన్సీలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పబ్లిక్, పోలీసులతో బౌన్సర్లు చాలా మిస్ బిహేవ్ చేస్తున్నారని అన్నారు. ఇక పోలీసులపై బౌన్సర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఒక్కోసారి భద్రత కల్పించే పోలీసులను కూడా నెట్టేస్తున్నారని మండిపడ్డారు. ఇంకోసారి ఇలా చేస్తే బౌన్సర్లు, ఏజెన్సీలపై కఠిన చర్యలు ఉంటాయని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు.
‘సంధ్య థియేటర్ ఘటనలో పోలీస్ ఆఫీసర్లను కూడా బౌన్సర్లు తోసేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఏదైనా ఈవెంట్ జరిగితే దానికి సంబంధించి బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదే. ప్రజలకు నష్టం కలిగితే ఊరుకునేది లేదు. బౌన్సర్లు అనుచితంగా ప్రవర్తించినా వీఐపీలు, నిర్వాహకులదే బాధ్యత. పబ్లిక్, పోలీసులతో బౌన్సర్లు చాలా మిస్ బిహేవ్ చేస్తున్నారు. పోలీసులపైనా బౌన్సర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. భద్రత కల్పిస్తున్న పోలీసులను కూడా నెట్టేస్తున్నారు. ఇంకోసారి ఇలా చేస్తే బౌన్సర్లు, ఏజెన్సీలపై కఠిన చర్యలు ఉంటాయి’ అని సీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా హెచ్చరించారు.
‘బౌన్సర్లు పోలీసులను కూడా నెట్టేశారు. బౌన్సర్లకు వార్నింగ్ ఇవ్వదలుచుకున్నా. బౌన్సర్లను సప్లయ్ చేసే ఏజెన్సీలకు నేను వార్నింగ్ ఇస్తున్నా. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక పై బౌన్సర్లు ఎక్కడైనా మిస్ బిహేవ్ చేసినా, యూనిఫామ్ లో ఉన్నప్పుడు పోలీసు అధికారులను టచ్ చేసినా వారిని వదిలే ప్రసక్తే లేదు. సంధ్య థియేటర్ లో బౌన్సర్లు పబ్లిక్ ను తోసేశారు, పోలీసులను కూడా తోసేశారు. వాళ్లే గేట్లు ఓపెన్ చేస్తున్నారు, వాళ్లే క్లోజ్ చేస్తున్నారు. వాళ్లే అన్నీ చేస్తున్నారు. ఈ విధంగా వ్యవహరిస్తే లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుంది? పోలీసులకు సవాల్ గా మారుతోంది.
వీఐసీలు, వీవీఐపీలు.. ఎవరైనా సరే.. వారి బౌన్సర్లు వ్యవహరించే తీరుకు పూర్తి బాధ్యత వారిదే. బౌన్సర్లను సప్లయ్ చేసే ఏజెన్సీలదే బాధ్యత. వారికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి. మీ చర్యల వల్ల ప్రజలకు నష్టం కలుగుతుందా అని ఆలోచించే బాధ్యత కూడా ఆ వీఐపీదే. తర్వాత ఇచ్చే వివరణలు ఏవీ పని చేయవు. ఇది పూర్తిగా వారి బాధ్యతే. మేము ప్రజలకు బాధ్యతగా ఉండాలి’ అని సీపీ సీవీ ఆనంద్ అన్నారు.
Also Read : పుష్ప సినిమాకు సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వమే తొలి ముద్దాయి- సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు