Wedding in Hospital : డెంగ్యూతో బాధపడుతున్న వరుడు.. ఆసుపత్రిలోనే ఒక్కటైన జంట

పెళ్లికొడుకు డెంగ్యూతో బాధపడుతున్నాడు. రెండు రోజుల్లో అతని పెళ్లి .. పెళ్లిని వాయిదా వేసుకోలేదు.. వేదిక మాత్రమే మారింది. ఇంతకీ పెళ్లెక్కడ జరిగింది? చదవండి.

Wedding in Hospital

Wedding in Hospital : పెళ్లి తేదీ దగ్గరకొచ్చే సమయానికి వరుడు అనారోగ్యం పాలయ్యాడు. పెళ్లి వాయిదా వేయడం ఇష్టం లేక ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకున్నాడు. ఓ జంట పెళ్లి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Viral Video : కదులుతున్న రైలే వేదిక.. ప్రయాణికులే అతిథులు.. జంట పెళ్లి వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ మ్యాక్స్ హాస్పిటల్‌లో ఓ జంట పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆసుపత్రిలో పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏమైంది? అని షాకవుతున్నారా?  పెళ్లి రెండు రోజుల్లో ఉందనగా పెళ్లికొడుకు డెంగ్యూ బారిన పడ్డాడు. అతనిని ఆసుపత్రిలో చేర్చారు. నవంబర్ 27 న పెళ్లి తేదీగా నిర్ణయించారు. పెళ్లి వాయిదా వేయడానికి వరుడు ససేమిరా అన్నాడు. అంతే ఇరువైపు పెద్దలు షెల్యూల్ ప్రకారం ఆసుపత్రిలోనే ఈ జంట పెళ్లి చేసారు. పెళ్లి దుస్తుల్లో ముస్తాబైన వధూవరులిద్దరూ దండలు మార్చుకుని ఒక్కటయ్యారు. చాలామంది పెళ్లికి ఓకే అనుకున్నాక నిశ్చితార్థం, పెళ్లితేదీలు నిర్ణయించడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. వధూవరులిద్దరి జాతకానికి తగిన తేదీని ఫిక్స్ చేస్తారు. అందుకే పెళ్లి తేదీని వాయిదా వేయడానికి చాలామంది సంకోచిస్తారు.  బహుశా ఈ సెంటిమెంట్ పాటించారేమో ఆసుపత్రిలో అనుకున్న సమయానికి పెళ్లి వేడుక జరిపించారు.

Viral Video: పెళ్లి వేడుకలో అందరూ భోజనం చేస్తుండగా గొడవ.. కుర్చీలు విసురుకుంటూ రచ్చ రచ్చ

Piyush Rai అనే ట్విట్టర్ యూజర్ ఈ జంట పెళ్లి వీడియోను షేర్ చేశారు. వీడియో చూసిన నెటిజన్లు జంటకు విషెస్ చెప్పారు. మీకు మంచి రోజులు వస్తాయని విష్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు