Viral Video: పెళ్లి వేడుకలో అందరూ భోజనం చేస్తుండగా గొడవ.. కుర్చీలు విసురుకుంటూ రచ్చ రచ్చ

భోజనం చేస్తున్న ఓ వ్యక్తి వద్దకు వచ్చిన మరో వ్యక్తి అతడి టోపీని తీసి కిందపారేశాడు. అనంతరం..

Viral Video: పెళ్లి వేడుకలో అందరూ భోజనం చేస్తుండగా గొడవ.. కుర్చీలు విసురుకుంటూ రచ్చ రచ్చ

Pakistan Wedding

Updated On : September 1, 2023 / 11:30 AM IST

Viral Video – Pakistan: పెళ్లి వేడుక అనంతరం హాయిగా కడుపునిండా తిందామని కూర్చున్న అతిథులు ఒక్కసారిగా లేచి గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. పాకిస్థాన్‌లోని ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుకలో ఘర్షణకు సంబంధించిన వీడియో సాామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

భోజనం చేస్తున్న ఓ వ్యక్తి వద్దకు వచ్చిన మరో వ్యక్తి అతడి టోపీని తీసి కిందపారేశాడు. అనంతరం అతడిని కొట్టాడు. ఎందుకు కొట్టాడన్న విషయంపై స్పష్టతలేదు. గొడవ మొదలైంది.

భోజనం చేస్తున్న వారి వద్దకు మరికొందరు వచ్చి పిడిగుద్దులు కురిపించారు. అక్కడున్న సామగ్రి అంతా నాశనమైపోయింది. చాలా మంది గొడవపడ్డారు. మహిళలు కలుగజేసుకుని ఈ ఘర్షణను ఆపేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వారి మాటలను ఎవరూ వినలేదు.

పిడిగుద్దులు కురిపించుకోవడాన్ని కొనసాగించారు. ఓ కెమెరాకు ఆ దృశ్యాలన్నీ చిక్కాయి. దాదాపు ఆరు నిమిషాల పాటు ఉన్న ఈ వీడియోను ఒకరు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. పెళ్లిలో ఇటువంటి గొడవ పడితే ఎలా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Pawan Kalyan : అభిమానులందు పవన్ అభిమానులు వేరయా.. 470 కేజీల వెండితో..