Viral Video : ఓ వ్యక్తి కాఫీ మేకింగ్ వీడియో చూస్తే ఫిదా అవుతారు

హోటల్స్‌లో కాఫీ, టీలు తయారు చేసేవారు త్వరగానే కలిపి ఇస్తుంటారు. ఓ కాఫీ షాప్‌లో ఓ వ్యక్తి అత్యంత వేగంగా కాఫీ కలుపుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. అతని కాఫీ మేకింగ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Viral Video

Viral Video : కాఫీ అంటే అందరికీ ఇష్టమే. అదీ ఫిల్టర్ కాఫీ అంటే మరీ ఇష్టపడతారు. పాండిచ్చేరిలోని ఓ కాఫీ షాప్‌లో కాఫీ తయారు చేస్తూ కనిపించిన ఓ వ్యక్తి వీడియో వైరల్ అవుతోంది. అతను కాఫీ కలిపే విధానం చూస్తే ఎంత అనుభవం ఉంటే ఇలా సాధ్యమనిపిస్తుంది.

Most Expensive Coffee : పిల్లుల మలంతో చేసే కాఫీ .. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టేస్టీ కాఫీ
వికాస్ ఖన్నాఅనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో (vikaskhannagroup) వేగంగా ఫిల్టర్ కాఫీ తయారు చేస్తున్న ఓ వ్యక్తి వీడియోను షేర్ చేసారు. ‘ఇండియాస్ ట్రూ మాస్టర్ చెఫ్..చాలా R.E.S.P.E.C.T’ అనే శీర్షికతో పోస్ట్ చేసిన ఈ వీడియోను తరుణ్ అనే ఫుడ్ బ్లాగర్ షూట్ చేసారట. వీడియో కనిపించిన వ్యక్తి  పాండిచ్చేరిలోని ఓ దుకాణంలో కాఫీ తయారు చేస్తాడని ఖన్నా తన పోస్టులో వివరించారు.

Mumbai : కాఫీ బార్ యువకుడి ఆశయం చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెబుతున్న కస్టమర్లు

వీడియోలో టేబుల్ పై అనేక కాఫీ గ్లాసులు కనిపిస్తాయి. వాటిలో చాలా వేగంగా పంచదార వేయడం ప్రారంభిస్తాడు. గ్లాసుల్లోకి బ్లాక్ కాఫీ పోయడం.. ఆ తరువాత పాలను మిక్స్ చేయడం.. మొత్తం తయారు చేసే విధానం అద్భుతంగా కనిపిస్తుంది. రీసెంట్‌గానే పోస్ట్ చేసిన ఈ వీడియో లక్షల సంఖ్యలో వ్యూస్‌తో దూసుకుపోతోంది. ‘అతనిని చూస్తే గౌరవం కలుగుతోంది’ .. ‘వావ్.. ఫిల్టర్ కాఫీ’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు.