Viral Video : కష్టంలో ఉన్న కుటుంబానికి భోజనం పెట్టించిన వ్యక్తి.. హీరో అంటున్న నెటిజన్లు

కష్టంలో ఉన్నవారికి సాయం చేయడం అంటే డబ్బులు మాత్రమే ఇవ్వడం కాదు.. నిజానికి వారికి ఏం అవసరమో తెలుసుకుని అది తీర్చడం.. ఓ కుటుంబానికి కడుపునిండా భోజనం పెట్టించి వారిని సంతోషంగా ఇంటికి పంపిన ఓ వ్యక్తి వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Viral Video

Viral Video : ఎవరైనా కష్టంలో ఉండి సాయం అడిగితే తోచిన డబ్బులు ఇస్తారు కొందరు. కానీ వారికి ఏది అవసరమో గమనించి సాయం అందిస్తారు మరికొందరు. కష్టాల్లో ఉన్న ఓ కుటుంబానికి కడుపునిండా భోజనం పెట్టించాడు ఓ వ్యక్తి. నెటిజన్లు అతడిని హీరో అంటూ అభినందిస్తున్నారు.

Dilawar Khan : 65 ఏళ్ల వయస్సులో ఒకటవ తరగతిలో చేరిన వృద్ధుడు.. ఏజ్ జస్ట్ నంబర్ అంటున్న నెటిజన్లు

ఇంటర్నెట్‌లో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని అందంగా, కొన్ని బాధగా, కొన్ని వికారంగా, కొన్ని కన్నీరు పెట్టించేలా.. కొన్ని మనసుని కదిలించేలా ఉంటాయి. abrokecollegekid అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ అయిన వీడియో మనసుని హత్తుకుంది. మొహమ్మద్ ఆషిక్ అనే డిజిటల్ క్రియేటర్ చేసిన మంచి పనిని కళ్ల ముందు ఉంచింది. కష్టాల్లో ఉన్న ఓ కుటుంబం కడుపునిండా తిండి తిని ఎన్ని రోజులైందో.. వారిని ఓ హోటల్‌కి తీసుకువచ్చి ఆ కుటుంబంలోని పెద్దలు, పిల్లలకు కడుపునిండా తిండి పెట్టించి తిరిగి ఆటోలో వారిని ఇంటికి పంపించాడు ఆషిక్.

Sriya Reddy : పవన్ కళ్యాణ్‌పై సలార్ నటి వైరల్ కామెంట్స్..OG మూవీలో..

‘ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టించడం అంటే అది వారి అవసరం తీర్చడమే కాదు.. వారి ప్రయాణంలో ఒంటరిగా లేరని గుర్తు చేయడం కూడా’ అనే శీర్షికతో పోస్ట్ చేసిన వీడియో కన్నీరు పెట్టించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆషిక్‌ను అభినందించారు. మరెంతోమందికి ఆదర్శంగా నిలిచిన ఆషిక్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.