Dilawar Khan : 65 ఏళ్ల వయస్సులో ఒకటవ తరగతిలో చేరిన వృద్ధుడు.. ఏజ్ జస్ట్ నంబర్ అంటున్న నెటిజన్లు

చదువుకోవాలని కోరిక ఉన్నా కొందరికి పరిస్థితులు సహకరించవు. బాధ్యతల్లో పడి చదువుని మర్చిపోతారు. కానీ ఓ పెద్దాయన బాధ్యతలు పూర్తయ్యాక ఓనమాలు దిద్దడం మొదలుపెట్టాడు. జ్ఞానం సంపాదించుకోవడానికి వయసుతో సంబంధం లేదని ప్రూవ్ చేశాడు.

Dilawar Khan : 65 ఏళ్ల వయస్సులో ఒకటవ తరగతిలో చేరిన వృద్ధుడు.. ఏజ్ జస్ట్ నంబర్ అంటున్న నెటిజన్లు

Dilawar Khan

Dilawar Khan : కొందరిలో చదువుకోవాలని ఆసక్తి ఉన్నా ఇంట్లో ఆర్ధిక పరిస్థితులు సహకరించవు. చిన్న వయసులోనే బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఓ పెద్దాయనది ఇదే పరిస్థితి. అయితే చదువుకోవాలన్న కలను మాత్రం ఆయన మర్చిపోలేదు.. పోస్ట్ పోన్ చేశాడంతే. 65 ఏళ్ల వయసులో ఒకటవ తరగతిలో చేరి అందర్నీ ఆశ్చర్యపరచడమే కాదు.. చదువుకి వయసు అడ్డంకి కాదనే విషయాన్ని నిరూపించాడు. ఎవరాయన? చదవండి.

Inspirational Story of Bharathi : కూలి పని చేస్తూ కెమెస్ట్రీలో PHD చేసిన సాకే భారతి స్ఫూర్తివంతమైన కథ

చదువుకోవాలనే ఆసక్తి ఉండాలే కానీ వయసు అనేది జస్ట్ నంబర్ అని నిరూపించారు ఓ పెద్దాయన. పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డిర్ ఉప్పర్‌లో నివాసం ఉంటున్న 65 ఏళ్ల దిలావర్ ఖాన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరి తన చదువుల ప్రయాణాన్ని ప్రారంభించారు. ఖాన్ స్టోరి చదువుకి వయసు ఆటంకం కాదనే అంశాన్ని నిరూపిస్తూ స్ఫూర్తిని కలిగిస్తోంది. నిరుపేద కుటుంబంలో జన్మించిన దిలావర్ ఖాన్ చిన్నతనం నుండి తన వ్యక్తిగత విషయాల కంటే కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. చదువుకోవాలనే ఇష్టం ఉన్నా దానిని మనసులోనే ఉంచుకుని పదవీ విరమణ చేయాల్సిన వయసులో స్కూలు జీవితం ప్రారంభించడం నిజంగా అభినందనీయం.

Non Engineering Student : గూగుల్‌లో జాబ్ కొట్టడం ఇంత ఈజీనా.. ఇంజనీరింగ్‌తో పనిలేదని నిరూపించిన డిగ్రీ స్టూడెంట్.. రూ. 50 లక్షల జీతం!

ప్రభుత్వ పాఠశాల ఖోంగ్‌సాయ్ దిలావర్ ఖాన్‌ ఘనంగా స్వాగతం పలికింది. పాఠశాల సిబ్బంది చదువుకోవాలనే అతని ఇష్టానికి మద్దతు ఇచ్చింది. పాఠశాల గదిలో చిన్నారుల మధ్యలో కూర్చుని దిలావర్ ఖాన్ చదువుకుంటున్న ఫోటో చూస్తే ముచ్చట అనిపిస్తోంది. Propergaanda అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ దిలావర్ ఖాన్ స్ఫూర్తివంతమైన కథను షేర్ చేశారు. వ్యక్తిగత కారణాలతో చదువుని ఆలస్యం చేసిన వ్యక్తులకు దిలావర్ స్టోరీ ప్రేరణగా నిలుస్తుందని రాసారు. చదువుకోవడం ద్వారా విజ్ఞానం సాధించడమనేది జీవితంలోని ఏ దశలో అయినా సంపాదించుకోవచ్చనే అంశాన్ని దిలావర్ ఖాన్ స్టోరీ నొక్కి చెబుతోంది. పెద్దాయన గురించి తెలుసుకున్న నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గర్వపడుతున్నామని కామెంట్లు చేశారు. దిలావర్ ఖాన్ స్టోరీ వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by @propergaanda