Mumbai : ట్రైన్‌లో యువతితో స్టెప్పులేసిన పోలీస్.. సీరియస్ అయిన అధికారులు

విధుల్లో ఉన్న ఓ పోలీసు బాధ్యతను విస్మరించాడు. యువతితో కలిసి కదులుతున్న ట్రైన్‌లో స్టెప్పులు వేసాడు. ఫలితం ఏమైందో చదవండి.

Mumbai

Mumbai : ముంబయిలో ఓ పోలీసు అధికారి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కదులుతున్న ట్రైన్‌‌లో ఓ యువతితో  హోంగార్డు SF గుప్తా స్టెప్పులేసిన వీడియో బయటకు రావడంతో అధికారులు సీరియస్ అయ్యారు.

Naatu Naatu : నాటు నాటు స్టెప్ వేసిన అవెంజర్స్ స్టార్ లోకి.. పిక్ వైరల్

saiba__19 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో కదులుతున్న ట్రైన్‌లో ఓ యువతి స్టెప్పులు వేయడం ప్రారంభించింది. ఆమెను హెచ్చరించాల్సిన పోలీసు సైతం స్టెప్పులు వేయడం ప్రారంభించారు. ముంబయి సెంట్రల్ రైల్వే లోకల్ ట్రైన్ సెకండ్ క్లాస్ లేడీస్ కోచ్‌లో డిసెంబర్ 6 న ఈ ఘటన జరిగింది. అప్పుడు సమయం రాత్రి పది గంటలుగా తెలుస్తోంది. ఆ సమయంలో మహిళల భద్రత కోసం కేటాయించబడిన హోంగార్డు గుప్తా విధుల్లో ఉండి ఇలా ప్రవర్తించడం విమర్శలకు దారి తీసింది.

Anushka And Virat Kohli : కోహ్లీ, అనుష్కల వివాహ వార్షికోత్సవ ఫొటోలు వైరల్.. అనుష్కశర్మ ఏమన్నదంటే?

గుప్తా డ్యాన్స్ చేస్తున్న వీడియో  డివిజనల్ రైల్వే మేనేజర్ అధికారిక ఖాతా నుండి  RPF కు ట్యాగ్ చేశారు. RPF దీనిని గుర్తించడంతో విషయం సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై స్పందించిన రైల్వే పోలీసులు (GRP) డిసెంబర్ 8 న గుప్తాను వివరణ కోరుతూ నోటీసు పంపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామంటూ రైల్వే పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇతరుల్ని హెచ్చరించాల్సిన పోలీసు కాస్తా బాధ్యత మరచి చిక్కులు కొని తెచ్చుకున్నారు.