Viral Video: చిరాకు వచ్చి కార్లను ఫ్లైఓవర్ మీదే వదిలేసి వెళ్లిపోయిన బెంగళూరు వాసులు

ఫ్లైఓవర్‌పై కూడా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. దీంతో వాహనదారులు విసుగెత్తిపోయారు.

బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయామంటే చుక్కలు కనపడతాయి. గత రాత్రి బెంగళూరు వాహనదారులు మరోసారి భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నారు.

ఫ్లైఓవర్లపై కూడా భారీగా ట్రాఫిక్ జామ్‌ కావడంతో ముందుకు కదలలేక, వెనక్కు వెళ్లలేక అక్కడే తమ వాహనాలను వదిలేసి నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

రూపేన అగ్రహార వద్ద వర్షాల కారణంగా నీరు రోడ్లపైకి చేరడంతో, రద్దీని నివారించడానికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఫ్లైఓవర్‌కు ఒక వైపు మూసివేశారు. దీంతో వాహనాలు నత్తనడకన ముందుకు సాగాయి. ఫ్లైఓవర్‌పై కూడా గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. దీంతో వాహనదారులు విసుగెత్తిపోయారు.

వారు ఫ్లైఓవర్‌పైనే కార్లను వదిలి వెళ్లడంతో మరింత ట్రాఫిక్‌ జామ్‌ అయింది. ఆ సమయంలో కొందరు వీడియోలు తీశారు. భారీ వర్షాల కారణంగా అక్టోబరు 23న ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించాలని కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ప్రైవేట్ కంపెనీలకు సూచించింది. అయినప్పటికీ రోడ్లపై భారీగా వాహనాలు కనపడ్డాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో 2 వారాల సమయం.. ట్రంప్, కమలా హారిస్‌లో ఎవరు ముందంజలో ఉన్నారు?