నిర్భయ కేసులో డెత్ వారెంట్ పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వినయ్ శర్మ

నిర్భయ కేసులో డెత్ వారెంట్ పై వినయ్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు.

  • Publish Date - January 9, 2020 / 07:18 AM IST

నిర్భయ కేసులో డెత్ వారెంట్ పై వినయ్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు.

నిర్భయ కేసులో డెత్ వారెంట్ పై వినయ్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 7న పటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ పై స్టే ఇవ్వాలని కోరారు. ట్రయల్ కోర్టు విధించిన ఉరిశిక్షపై స్టే ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నారు. నిర్భయ దోషులు అక్షయ్, పవన్ త్వరలో క్యురేటివ్ పిటిషన్లు దాఖలు చేయనున్నారు. నిర్భయ కేసులో నలుగురు దోషులను (జనవరి 22, 2020) ఉదయం 7 గంటలకు ఉరి తీయాలన్న పటియాలా హౌస్ కోర్టు తీర్పు ఇచ్చింది.

నిర్భయ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డెత్ వారెంట్ జారీ చేసిన తర్వాత నలుగురు దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పాటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. తమకు విధించిన ఉరి శిక్షను నిలుపుదల చేయాలని దోషులు.. ప్రధానంగా ఎస్ ఎల్ పీ, రివ్యూ పిటిషన్..ఆఖరి అవకాశంగా క్యురేటివ్ పిటిషన్ ను ఉపయోగించునే ఛాన్స్ ఉంటుంది. 

ఢిల్లీలో డిసెంబర్16, 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో ఇన్నాళ్ల నిరీక్షణ తర్వాత మిగిలిన నలుగురు దోషులకు డెత్ వారంట్ జారీ అయింది. ఢిల్లీలోని పటియాలా కోర్టు మంగళవారం నిర్భయ దోషులకు మరణ దండన విధించేందుకు 2020 జనవరి, 22వ తేదీని ఖరారు చేసింది. 2012లో నిర్భయపై కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ ‌కు పాల్పడ్డారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది.

ఈ కేసులో మొత్తం ఆరుగురిలో ఒకడు జైల్లో ఆత్మహత్య చేసుకోగా, మరొకరు మైనర్ కావడంతో జువైనల్ చట్టం ప్రకారం.. మూడేళ్ల శిక్షా కాలం ముగిసాక విడుదల అయ్యాడు. మిగిలిన నలుగురిలో పవన్, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్, వినయ్‌ లకు ఉరిశిక్ష విధించాలని ఎప్పటినుంచో నిర్భయ తల్లిదండ్రులు పోరాటం చేస్తున్నారు. ఎట్టకేలకు ఇన్ని ఏళ్ల తర్వాత నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ అయింది.