Mumbai Traffic Police : డ్రెస్ తీసి రా..చీరేస్తా..అన్నాడు, తర్వాత ఏడ్చేశాడు.. వీడియో వైరల్

డ్రెస్ తీసి రా..చీరేస్తా..అంటూ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ఓ వ్యక్తి చిందులు తొక్కాడు. తన బాడీని చూపిస్తూ..అతనిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. అక్కడున్న వారంతా..ఏమి చేస్తాడోనన్న ఉత్కంఠ నెలకొంది. చివరకు సీన్ కట్ చేస్తే..ఓ మూలన కూర్చొని ఏడుస్తూ కూర్చొన్నాడు. తప్పైంది సార్ అంటూ పోలీసులను వేడుకున్నాడు.

Mumbai

Mumbai Traffic Police : డ్రెస్ తీసి రా..చీరేస్తా..అంటూ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ఓ వ్యక్తి చిందులు తొక్కాడు. తన బాడీని చూపిస్తూ..అతనిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. అక్కడున్న వారంతా..ఏమి చేస్తాడోనన్న ఉత్కంఠ నెలకొంది. చివరకు సీన్ కట్ చేస్తే..ఓ మూలన కూర్చొని ఏడుస్తూ కూర్చొన్నాడు. తప్పైంది సార్ అంటూ పోలీసులను వేడుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఈ ఘటన దేశ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన ముంబై మహానగరంలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని ముంబైలో ఓ ప్రాంతంలో ఓ వ్యక్తి తన కారును నో పార్కింగ్ స్థలంలో పార్క్ చేశాడు.

అది గమనించిన ట్రాఫిక్ అధికారి తన కిందిస్థాయి సిబ్బందితో కలిసి వచ్చి కారును తొలగించే ప్రయత్నం చేశారు. వెంటనే కారుకు సంబంధించిన వ్యక్తి ట్రాఫిక్ పోలీసు అధికారితో వాగ్వాదానికి దిగాడు. మహిళ కూడా చిందులు తొక్కారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తిస్తూ..నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. యూనిఫాం తీసిరా..చూద్దాం..చీరి పారేస్తా..అంటూ రెచ్చిపోయాడు. ఆ ట్రాఫిక్ అధికారి కూల్ గా వింటున్నాడే కానీ..ఎలాంటి కోపం ప్రదర్శించలేదు. వారిద్దరూ మాస్క్ ధరించలేదు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు.

అక్కడనే ఉన్న మరో పోలీసు దీనిని వీడియో తీశారు. వీడియో తీసుకో..ఫొటో తీసుకో అని బెదిరించారు. పలు కారణాలు చూపుతూ వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అప్పటి వరకు అది చేస్తా..ఇది చేస్తానని హుంకరించిన అతను బిక్కమొహం వేశాడు. ఓ మూలన కూర్చొని చిన్నపిల్లాడిలా ఏడుపు ప్రారంభించాడు. తప్పైంది సార్ అంటూ..ప్రాథేయపడ్డాడు. Shivangi Thakur ట్విట్టర్ వేదికగా ఈ వీడియోను ట్వీట్ చేశారు. క్షణాల్లో తెగ వైరల్ గా మారింది. తిక్క కుదిరింది..అంటూ..కొందరు..ట్రాఫిక్ అధికారి ఓపికను మరికొందరు మెచ్చుకుంటున్నారు.