UP : విష జ్వరాలు, 12 రోజుల్లో 50 మంది చిన్నారుల మృత్యువాత

ఉత్తరప్రదేశ్‌లో విషజర్వాలు చిన్నారుల ప్రాణాలు మింగేస్తున్నాయి. జ్వరంతో బాధపడుతూ చనిపోతున్న పిల్లల సంఖ్య రోజురోజుకు పెరుగోతోంది.

Fever

Viral fever : ఉత్తరప్రదేశ్‌లో విషజర్వాలు చిన్నారుల ప్రాణాలు మింగేస్తున్నాయి. జ్వరంతో బాధపడుతూ చనిపోతున్న పిల్లల సంఖ్య రోజురోజుకు పెరుగోతోంది. ఫిరోజాబాద్‌లో 12 రోజుల్లో 50 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. ఆసుపత్రిలో చేరిన వారం రోజుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు చనిపోవడంపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అకస్మాత్తుగా జ్వరం రావడం…ఆసుపత్రుల్లో చేరి చనిపోవడంతో జనాల్లో ఆందోళన మొదలైంది. చిన్నారుల మృతిపై ఆందోళన వ్యక్తం చేసింది ICMR. 11 మంది ఐసీఎంఆర్‌ నిపుణుల బృందం ఫిరోజాబాద్‌లో పర్యటించనుంది. వైరల్ ఫీవర్ బారిన పడుతున్న పిల్లల శాంపిళ్లు సేకరించనుంది.

Read More : Afghanistan : తాలిబన్లను నమ్మొచ్చా ? ఉగ్రవాదుల నోట కశ్మీర్ రాగం

వైరల్‌ ఫివర్లకు సంబంధించి పరిస్థితిని సీఎం యోగీ ఆదిత్యానాథ్ సమీక్షిస్తున్నారు. ఫిరోజాబాద్‌ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను తొలగించారు. వైద్య సేవలు అందించడంలో విఫలమయ్యారని చర్యలు తీసుకున్నారు. వెంటనే ఆ స్థానంలో కొత్త వ్యక్తికి బాధ్యతలు అప్పగించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం యోగీ ఆదిత్యానాథ్‌ సూచించారు.

Read More : Water Dispute : కృష్ణా బోర్డు మీటింగ్..హాట్ హాట్‌గా వాదనలు

11 మంది వైద్య బృందంతో పాటు అవసరమైన మందులు సరఫరా చేయాలని చెప్పారు. ఆసుపత్రిల్లో బెడ్స్ కొరత లేకుండా చూడాలని సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని సూచించారు. ఇక యూపీలో పలు జిల్లాల్లో వైరల్ ఫీవర్ల కేసులు పెరుగుతుండటంతో వైద్య సేవలపై దృష్టి సారించారు. ఈ నెల 7 నుంచి 16 వరకు జనాల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.