రోడ్డుపై ట్రాఫిక్‌ తనిఖీల్లో లంబోర్ఘిని కారును ఆపి.. దానితో సెల్ఫీ తీసుకున్న పోలీసు

సాధారణ తనిఖీల్లో భాగంగా సబూను పోలీసులు ఆపి చెక్ చేశారు.

రోడ్డుపై ట్రాఫిక్‌ తనిఖీల్లో భాగంగా ఖరీదైన లంబోర్ఘిని కారును ఆపిన ఓ పోలీసు.. అందులో కూర్చొని సెల్ఫీ తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త నిశాంత్ సబూ ఇటీవల తన లంబోర్ఘినిలో బెంగళూరులో వెళ్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.

సబూనే ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగా సబూను పోలీసులు ఆపి చెక్ చేశారు. అనంతరం, ఆ కారులో కూర్చొని సెల్ఫీ తీసుకుంటానని ఓ పోలీసు అడిగాడు. సబూ అంగీకరించడంతో పోలీసుల ఆ కారులో కూర్చునేందుకు ప్రయత్నిస్తాడు.

ఆ ఖరీదైన కారు లోపలికి ఎలా వెళ్లాలో కూడా తనకు తెలియదని ఆ పోలీసు చిరునవ్వుతో చెప్పాడు. ఆ పోలీసు తన సహోద్యోగిని ఫొటో తీయాలని అడుగుతాడు. నిజానికి ఈ వీడియోను ఆగస్టు 25కి షేర్ చేశారు. ఇప్పుడు కూడా ఈ వీడియో వైరల్ అవుతూనే ఉంది. మిలియన్ల కొద్ది షేర్లను రాబడుతోంది. పోలీసులకు కారుతో సెల్ఫీ తీసుకునే అవకాశాన్ని ఇచ్చిన సబూపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Akkineni fans – Konda Surekha : కొండా సురేఖ దిష్టిబొమ్మ ద‌గ్ధం చేసిన అక్కినేని ఫ్యాన్స్‌..