సినిమాల్లో కార్లు తగలబడుతూ రోడ్లపై దూసుకెళ్తుంటాయి. అటువంటి సీనే నిజజీవితంలోనూ చోటుచేసుకుంది. అగ్నిలో తగలబడుతూ రోడ్డుపై దూసుకెళ్లింది ఓ కారు. జైపూర్‌లో ఎల్లప్పుడూ రద్దీగా ఉండే సోడలా సబ్జీ మండి ప్రాంతంలో ఫ్లైఓవర్‌పై కారు దహనమవుతోంది.. అందులో డ్రైవర్ లేడు.
కాలిపోతున్న కారుని అక్కడివారు చూస్తుండిపోయారు. ఒక్కసారిగా ఆ కారు ముందుకు కదిలి దూసుకెళ్లింది. దాని ముందు నిలబడిన వారంతా భయంతో పక్కకు తప్పుకున్నారు. కారు ముందుకు వస్తుండగా ఓ వాహనదారుడు తన బైకును పక్కకు తీస్తుండగా అది సాధ్యపడలేదు.
దీంతో దాన్ని తాకుతూ కారు ముందుకు వెళ్లింది. ఆ కారును ఫ్లై ఓవర్ మీదకు తీసుకొచ్చిన డ్రైవర్ పేరు జితేంద్ర అని, షార్ట్ సర్క్యూట్ కారణంగా అందులో మంటలు చెలరేగాయని తెలుస్తోంది. మంటలు, పొగలు రావడాన్ని గమనించిన జితేంద్ర వెంటనే కారులో నుంచి బయటకు వచ్చేశాడు.
డ్రైవర్ లేకుండానే ఎలివేటెడ్ రోడ్డుపై అది వేగంగా దూసుకుపోయింది. ఎలివేటెడ్ స్ట్రెచ్ దాటిన తర్వాత డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆ కారు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
GN saibaba passed away: గన్‌పార్క్ వద్దకు రేపు ఉదయం సాయిబాబా పార్థివ దేహం