అసోంలోని కజిరంగా నేషనల్ పార్క్‌లో తల్లీకూతుళ్లు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. పార్కులో జీపులో వెళ్లి ఖడ్గ మృగాలను చూస్తున్న వేళ అందులో నుంచి పడిపోయారు ఆ తల్లీకూతుళ్లు.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పార్కులో జీప్ సఫారీ చేస్తూ ఖడ్గమృగాల వద్దకు వెళ్లిన వేళ దారికి అడ్డంగా ఆ మృగాల్లో ఒకటి నిలబడింది. దీంతో మూడు జీపులను అక్కడే ఆపేశారు.
ఖడ్గమృగం దారి నుంచి కాస్త తప్పుకోవడంతో రెండు జీపులు ముందుకు దూసుకెళ్లాయి. దీంతో అందులోని పర్యాటకుల్లో ఇద్దరు మహిళలు (తల్లీకూతుళ్లు) జీపులో నుంచి కింద పడిపోయారు. దీంతో వారు భయాందోళనలకు గురయ్యారు.
ఖడ్గమృగం వారిని ఏమీ చేయకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఇద్దరు మహిళలు తిరిగి జీపులోకి ఎక్కారు. ఈ ఘటనపై పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకులకు ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కజీరంగా పార్క్ సిబ్బందికి సూచిస్తున్నారు.
🚨 Major Accident Averted in Kaziranga National Park as Mother and Daughter Fall in Front of Rhinos, Escape Unscathed.#Watch #KazirangaNationalPark pic.twitter.com/1Uy0RlA4sQ
— Younish P (@younishpthn) January 6, 2025