ACB Raids : మాజీమంత్రి కేటీఆర్ నివాసంలో ఏసీబీ సోదాలు..

ఏసీబీ అధికారులు కేటీఆర్ నివాసంలో సోదాలు చేయడం.. రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

ACB Raids : మాజీమంత్రి కేటీఆర్ నివాసంలో ఏసీబీ సోదాలు..

Updated On : January 6, 2025 / 6:06 PM IST

ACB Raids : మాజీ మంత్రి కేటీఆర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఓరియన్ విల్లాస్ లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఏసీబీ అధికారులు ఏకంగా కేటీఆర్ నివాసంలో సోదాలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గచ్చిబౌలిలోని కేటీఆర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. తన ఇంట్లో సోదాలు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఏసీబీ విచారణకు వచ్చిన సమయంలో ఆయనీ కామెంట్స్ చేశారు.

నిధులు విదేశాలకు దారి మళ్లించారని అభియోగం..
ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో నిధులను విదేశాలకు దారి మళ్లించారని కేటీఆర్ పై ప్రధాన అభియోగం. ఇప్పటికే దీనిపై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కేసును ఆయన సవాల్ చేశారు. ఆ పిటిషన్ పై తీర్పు వచ్చే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అయితే, విచారణను యధాతధంగా కొనసాగించవచ్చంది.

రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన ఏసీబీ సోదాలు..
ఈ నేపథ్యంలో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి ఇవాళ విచారించాలని ఏసీబీ అధికారులు భావించారు. అయితే, తన న్యాయవాదులను అనుమతిస్తేనే తాను విచారణకు సహకరిస్తారని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఆ తర్వాత తాను చెప్పాలనుకున్న దాన్ని లిఖితపూర్వకంగా లేఖ ద్వారా ఏసీబీ అధికారికి అందజేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. తాజాగా ఏసీబీ అధికారులు కేటీఆర్ నివాసంలో సోదాలు చేయడం.. రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Also Read : ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో బిగ్ ట్విస్ట్.. కీలక అంశాలను బయటపెట్టిన సర్కార్.. కేటీఆర్ స్ట్రాంగ్ రియాక్షన్