KTR: ఫార్ములా ఈ-కారు రేస్ కేసులో బిగ్ ట్విస్ట్.. కీలక అంశాలను బయటపెట్టిన సర్కార్.. కేటీఆర్ స్ట్రాంగ్ రియాక్షన్
ఫార్ములా ఈ-కారు రేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక విషయాలను బయటపెట్టింది. ఫార్ములా ఈ-కారు రేసు నిర్వహించిన గ్రీన్ కో సంస్థ ద్వారా

Telangana govt claimed BRS party benefited crores of rupees through Green Co
Formula E-Car Race Case: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం హైడ్రా చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణకు రావాలని ఏసీబీ అధికారులు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. దీంతో సోమవారం తన లాయర్ తో కలిసి కేటీఆర్ విచారణకు హాజరయ్యేందుకు ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్దకు వచ్చారు. ఈ క్రమంలో కేటీఆర్ కార్లను కార్యాలయం గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కేవలం మీరు మాత్రమే వెళ్లాలని, మీ లాయర్ కు లోపలికి అనుమతి లేదని పోలీసులు తెలియజేశారు. దీంతో పోలీసులకు, కేటీఆర్ కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కేటీఆర్ ఉన్నతాధికారులతో ఈ విషయంపై మాట్లాడారు. లాయర్ కు అనుమతి లేదని చెప్పడంతో కొద్దిసేపు అక్కడే వేచిఉన్న కేటీఆర్ ఏసీబీ కార్యాలయం ఎదుట నుంచి విచారణకు హాజరు కాకుండా వెనక్కు తిరిగి వెళ్లిపోయారు.
Also Read: Bandi Sanjay : ఏడాది పాటు రైతు భరోసా ఎగ్గొట్టారు- రేవంత్ సర్కార్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్
కేటీఆర్ కు మరోసారి నోటీసులు..
ఏసీబీ కార్యాలయం వద్దకు వచ్చిన కేటీఆర్ విచారణకు హాజరుకాకుండా వెనుదిరిగి పోవడంపై ఏసీబీ అధికారులు స్పందించారు. న్యాయవాదులను తీసుకువచ్చి కేటీఆర్ హైడ్రామా క్రియేట్ చేశారని అన్నారు. ఏసీబీ విచారణ తప్పించుకోవడానికి న్యాయవాదులను తీసుకొచ్చారని, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని అన్నారు. దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు చెప్పినా కేటీఆర్ ఖాతరు చేయలేదని, న్యాయస్థానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామన్నారు. అయితే, ఏసీబీ అధికారులు కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం కేటీఆర్ కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: KTR: ఏసీబీ కార్యాలయం వద్ద హైడ్రామా.. వెనక్కు వెళ్లిపోయిన కేటీఆర్.. సీఎం రేవంత్‌పై సంచలన వ్యాఖ్యలు
మళ్లీ కోర్టుకెళ్లనున్న కేటీఆర్?
ఇదిలాఉంటే.. న్యాయవాది సమక్షంలో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కేటీఆర్ ఆశ్రయించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే కేటీఆర్ క్వాష్ పిటిషన్ తీర్పును కోర్టు రిజర్వ్ లో ఉంచిన విషయం తెలిసిందే. రేపు విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇవ్వగా.. ఈడీ విచారణకు సమయం కోరే యోచనలో కేటీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
కీలక అంశాలను బయటపెట్టిన సర్కార్..
ఫార్ములా ఈ-కారు రేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక విషయాలను బయటపెట్టింది. ఫార్ములా ఈ-కారు రేసు నిర్వహించిన గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి రూ. కోట్లలో లబ్ధి చేకూరినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఎన్నికల బాండ్ల ద్వారా రూ.41 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. గ్రీన్ కో, అనుబంధ సంస్థలు 26సార్లు బాండ్లు కొన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2022 ఏప్రిల్ 8వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ మధ్య ఈ బాండ్లు కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
కేటీఆర్ ఏమన్నారంటే..
గ్రీన్ కో సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూరినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ‘‘గ్రీన్ కో 2022లో ఎన్నికల బాండ్లు ఇచ్చింది.. 2023లో ఫార్ములా ఈ- కారు రేసు జరిగింది. కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రీన్ కో బాండ్లు ఇచ్చింది. ఫార్ములా ఈ-కారు రేసు కారణంగా గ్రీన్ కో నష్టపోయింది. అందుకే మరుసటి ఏడాది స్పాన్సర్ షిఫ్ నుంచి తప్పుకుంది. అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది. పార్లమెంట్ ఆమోదించిన ఎన్నికల బాండ్లు అవినీతి ఎలా అవుతుంది. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధం’’ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.