Viral video : వామ్మో..ఈ వీడియో చూస్తే .. గుండెలు బేజారే..!!

ఈ వీడియో చూస్తే వారి నాయనో గుండెలు దడదడలాపోతాయి.వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తుంది. అలాంటి ఒక వీడియోనే సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

huge python crawling on staircase railing sparks panic

Viral video : ఈ వీడియో చూస్తే వారి నాయనో గుండెలు దడదడలాపోతాయి.వెన్నులోంచి వణుకు పుట్టుకొస్తుంది. అలాంటి ఒక వీడియోనే సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ముప్పై రెండు సెకన్‌ల నిడివిగల ఈ వీడియోలో ఒక భారీ కొండచిలువ ఓ ఇంట్లోకి దూరుతున్న దృశ్యాలు చూస్తే ఎంత ధైర్యం ఉన్నవారికైనా దడపుడుతుంది. మెట్లకు ఆనుకుని ఉండే రెయిలింగ్‌పై పాకుతూ ఆ కొండచిలువ ఇంటి పై అంతస్తులోకి వెళ్తున్న వీడియో నెటిజన్‌ల ఒళ్లు జలదిరింప జేస్తోంది.

ఇండియన్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ సుశాంతానంద ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో విషసర్పాలను పట్టేవారికి కూడా భయకలుగి తీరుతుందనన్నట్లుగా ఉంది. ట్విట్టర్‌లో షేర్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్‌ అయ్యింది. సోమవారం ఉదయం పదిన్నరకు పోస్టు చేయగా.. మధ్యాహ్నానికి 10 వేల మందికిపైగా చూశారు.ఈ భయం పుట్టించే వీడియోపై ఓ లుక్కేయండీ..భయపడకపోతే ఒట్టు..