Viral Video: అంత ఎత్తులో ఉన్న సైన్‌ బోర్డును ఎక్కి పుల్‌ అప్స్‌ ఎలా చేశాడో చూడండి..

అంతేకాదు, మరొక యువకుడు స్తంభం పైభాగంలో కూర్చున్నాడు. ఈ వీడియోను..

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఫేమస్ కావాలని, ఎన్నో రకాల వీడియోలను తీసుకుంటూ రెచ్చిపోతున్నారు కొందరు. తాజాగా, ఓ యువకుడు హైవే సైన్‌ బోర్డును పట్టుకుని వేలాడుతూ పుల్‌ అప్స్‌ చేశాడు.

ఆ సైన్‌ బోర్డ్ 10 మీటర్ల ఎత్తులో ఉంటుంది అయినప్పటికీ దాన్ని ఎక్కి మరీ ఇలా పుల్‌ అప్స్‌ చేశాడు ఆ యువకుడు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియోలోని సైన్‌బోర్డ్‌పై ఎన్‌హెచ్‌ 931, మున్షిగంజ్ 06, అమేథి 3.5 అని చూపుతోంది. ఈ వైరల్ క్లిప్ ప్రకారం.. సైన్‌ బోర్డ్‌లోని ఇనుప నిర్మాణాన్ని పట్టుకుని ఆ యువకుడు పుల్ అప్స్ చేస్తున్నాడు.

అంతేకాదు, మరొక యువకుడు స్తంభం పైభాగంలో కూర్చున్నాడు. ఈ వీడియోను ఓ యూజర్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. హైవే సైన్‌ బోర్డును పట్టుకుని వేలాడిన యువకుడి వీడియోపై అమేథీ పోలీసులు స్పందించారు.

దీనిపై విచారణ జరుపుతామని తెలిపారు. విచారణ జరిపి, స్టంట్ చేసిన యువకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అమేథీ పోలీసులు తమ అధికారిక ఎక్స్‌ ఖాతాలో చెప్పారు. సైన్‌ బోర్డ్ పట్టుకుని వేలాడిన ఆ యువకుడి వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. రీల్స్ పిచ్చి మరీ ముదిరిపోతోందని కామెంట్లు చేస్తున్నారు.

 

Mini Moon : ఖగోళ అద్భుతం.. నేటి నుంచి భూమికి ఇద్దరు చంద్రులు.. 2 నెలలు మనతోనే.. భారత్‌లో కూడా కనిపిస్తుందా?