ధోని పేరుతో ఎగతాళి చేయొద్దు : పంత్ పై పూర్తి నమ్మకం ఉంది

టీమిండియా పటిష్టంగా ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. టీ20లో ప్రయోగాలు కొనసాగుతాయని చెప్పాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను కోహ్లి వెనకేసుకొచ్చాడు. అతడికి

  • Publish Date - December 5, 2019 / 10:04 AM IST

టీమిండియా పటిష్టంగా ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. టీ20లో ప్రయోగాలు కొనసాగుతాయని చెప్పాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను కోహ్లి వెనకేసుకొచ్చాడు. అతడికి

టీమిండియా పటిష్టంగా ఉందని కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. టీ20లో ప్రయోగాలు కొనసాగుతాయని చెప్పాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను కోహ్లి వెనకేసుకొచ్చాడు. అతడికి పూర్తి మద్దతిచ్చాడు. పంత్ ప్రతిభపై జట్టుకి పూర్తి నమ్మకం ఉందని విరాట్ చెప్పాడు. మిడిల్ ఆర్డర్ లో ఎలాంటి సమస్యా లేదని క్లారిటీ ఇచ్చాడు. రవీంద్ర జడేజా జట్టుకి బలం అని విరాట్ కోహ్లి చెప్పాడు. విండీస్ తో జరిగే టీ20 మ్యాచ్ కి సిద్ధంగా ఉన్నామని అన్నాడు. సరైన టీమ్ తో బరిలోకి దిగుతామన్నాడు. టీ20లో ర్యాంకింగ్స్ గురించి పట్టించుకోవడం లేదని విరాట్ చెప్పాడు. స్టేడియంలో ధోని పేరుతో నినాదాలు చేయడం కరెక్ట్ కాదన్న కెప్టెన్ కోహ్లి.. ధోని పేరు చెప్పి యువ వికెట్ కీపర్ ను ఎగతాళి చేయడం సమంజసం కాదన్నాడు. 

ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా… బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో తడబడింది. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్‌, కీపింగ్‌లో పంత్ విఫలమవడమే కాకుండా డీఆర్‌ఎస్‌ నిర్ణయాల్లోనూ తేలిపోయాడు. దీంతో అభిమానుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఈ క్రమంలో పంత్ ని ధోని వెనకేసుకొచ్చాడు. పంత్ ప్రతిభపై పూర్తి నమ్మకం ఉందన్నాడు.

విండీస్-టీమిండియా జట్ల మధ్య రేపు (డిసెంబర్ 6,2019) నుంచి మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది. అందులో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా మొదటి టీ 20 మ్యాచ్ జరగనుంది. స్వదేశంలో బంగ్లాదేశ్ తో జరిగిన సిరీస్ లో గెలిచిన భారత్.. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. భారత్ ని కట్టడి చేసి విజయాన్ని సొంతం చేసుకోవాలని విండీస్ భావిస్తోంది. 3 టీ20ల సిరీస్‌కు ధోనీ అందుబాటులో లేని విషయం తెలిసిందే. ధోని ప్లేస్ లో పంత్ వచ్చాడు.