Vivek Agnihotri: వై కేటగిరీ భద్రతతో మార్నింగ్ వాక్‭కు వెళ్లి ‘సొంత దేశంలోనే బంధీ’ అంటూ ట్వీట్ చేసిన ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్.. నెటిజెన్ల విమర్శలు

వీడియోను షేర్ చేస్తూ.. అగ్నిహోత్రి ఓ కామెంట్ చేశారు. ‘స్వదేశంలోనే ఇలా బంధీ’ అంటూ ఆయన చేసిన కామెంట్ కూడా విమర్శలకు కారణమైంది. ‘‘కాశ్మీర్‌లో హిందువులపై జరిగిన మారణహోమాన్ని చూపించడానికి చెల్లించాల్సిన మూల్యం. అది కూడా హిందూ మెజారిటీ ఉన్న దేశంలో. భావ ప్రకటనా స్వేచ్ఛ’’ అని ట్వీట్ చేశారు. అయితే ఆయన చేసిన ఈ ట్వీట్‭పై నెటిజెన్లు మండిపడుతున్నారు

Vivek Agnihotri: ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఒక వీడియో చర్చనీయాంశమైంది. ఆ వీడియోపై నెటిజెన్లు స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ‘మేం చెల్లించే టాక్స్ డబ్బును ఇలా ఉపయోగిస్తున్నారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వై కేటగిరీ భద్రత నడుమ మార్నింగ్ వాక్‭కు వెళ్లినప్పుడు తీసిన వీడియోను అగ్నిహోత్రి ట్వీట్ చేశారు. ఇంత పెద్ద మొత్తంలో ఆయనకు భద్రత కల్పించడంపై నెటిజెన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Boy Attempted To Raped : మధ్యప్రదేశ్ లో దారుణం.. ఎనిమిదేళ్ల బాలుడిపై మైనర్స్ అత్యాచారయత్నం

ఆ వీడియోను షేర్ చేస్తూ.. అగ్నిహోత్రి ఓ కామెంట్ చేశారు. ‘స్వదేశంలోనే ఇలా బంధీ’ అంటూ ఆయన చేసిన కామెంట్ కూడా విమర్శలకు కారణమైంది. ‘‘కాశ్మీర్‌లో హిందువులపై జరిగిన మారణహోమాన్ని చూపించడానికి చెల్లించాల్సిన మూల్యం. అది కూడా హిందూ మెజారిటీ ఉన్న దేశంలో. భావ ప్రకటనా స్వేచ్ఛ’’ అని ట్వీట్ చేశారు. అయితే ఆయన చేసిన ఈ ట్వీట్‭పై నెటిజెన్లు మండిపడుతున్నారు. కశ్మీర్ క్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించిన అనంతరం కూడా వివేక్ అగ్నిహోత్రికి భద్రత లేదనడం బాధాకరమని అంటున్నారు. ఇక కొందరైతే ‘మీరు చెల్లించే మూల్యం కాదు, మేం చెల్లిస్తున్న టాక్స్’ అంటూ మండిపడుతున్నారు.

Imran Khan Ex-Wife Marriage: మూడో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్ భార్య రెహమ్ ఖాన్

‘ఇలాంటి అనవసరపు బిల్డప్పుల కోసం మా డబ్బులు ఖర్చు చేస్తున్నారు’ అంటూ మరొక నెటిజెన్లు కాస్త కటువుగానే స్పందించారు. కశ్మీర్ నుంచి వలస వెళ్లిన కశ్మీరీ పండిట్ల సినిమాను నిర్మించడానికి చెల్లించిన మూల్యం అనే అర్థంలో ఆయన చెప్పుకొచ్చారు. కాగా, అగ్నిహోత్రికి అంత పెద్ద ఎత్తున భద్రత ఇవ్వడాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంపై సైతం విమర్శలు తప్పడం లేదు.

ట్రెండింగ్ వార్తలు