Hotel
BJP: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎంపీ భగవంత్ మాన్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని వీడేందుకు తనకు కేబినెట్ మంత్రి పదవిని ఆఫర్ చేసిందని ఆరోపించారు. బీజేపీ డబ్బు ఎరచూపుతూ వ్యాపారం చేస్తోందని భగవంత్ మాన్ ఆరోపించారు.
భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ పెద్ద నాయకుడి నుంచే ఈమేరకు పిలుపు వచ్చిందని చెప్పుకొచ్చారు భగవంత్ మాన్. అయితే ఆ బీజేపీ నేత ఎవరనే విషయం మాత్రం చెప్పలేదు.
మరో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దా మాత్రం దీనిపై మాట్లాడుతూ.. భగవంత్ మాన్‌కు బీజేపీలో చేరాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం నుంచి పిలుపు వచ్చిందని ఆరోపించారు.
Ashu Reddy: అందానికే అసూయ పుట్టించే యాపిల్ బ్యూటీ అషు!
ఆప్ పంజాబ్ నేతలకు కూడా బీజేపీ ఆఫర్లు ఇస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ ఇన్‌ఛార్జ్ రాఘవ్ చద్దా ఆరోపించారు. ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలు తమ పంజాబ్ యూనిట్ నేతలకు ఫోన్ చేసి బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని చద్దా అన్నారు.
పంజాబ్‌లో రానున్న రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో భగవంత్ మాన్ ప్రకటనపై చర్చ జరుగుతోంది. సంగ్రూర్ ఎంపీ భగవంత్ మాన్‌ను ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా చెబుతున్నారు పంజాబ్ ఆప్ యూనిట్ నేతలు.
Tomato: కొండెక్కిన టమాటో.. సెంచరీ కొట్టేసింది
ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. సీఎం పదవి కోసం మన దగ్గర చాలా మంది సమర్థులైన నాయకులు ఉన్నారని అందులో భగవంత్ మాన్ కూడా ఒకరు అన్నట్లుగా అభిప్రాయపడ్డారు.